Anushka Shetty : అనుష్క "ఘాటీ" ఎక్కడి వరకు వచ్చింది..?

Anushka Shetty :  అనుష్క ఘాటీ ఎక్కడి వరకు వచ్చింది..?
X

అనుష్క శెట్టి.. బాహబలి తర్వాత నెక్ట్స్ రేంజ్ కు వెళుతుందనుకుంటే సడెన్ గా వెనక బడిపోయింది. తర్వాత భాగమతి బ్లాక్ బస్టర్ అయినా.. ఎందుకో తన పర్సనాలిటీ వల్ల ఎక్కువ గ్యాప్ తీసుకుంది. కరోనా టైమ్ లో చేసిన నిశ్శబ్ధం ఏ శబ్దం చేయలేదు. బట్ రీసెంట్ గా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. ప్రస్తుతం మళయాలంలో ‘కథనార్’ అనే భారీ సినిమాలో నటిస్తోంది. ఇది రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ఈ యేడాది డిసెంబర్ లో విడుదలవుతుంది. అయితే కొన్నాళ్ల క్రితం క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందనున్న సినిమా ఇది. ఆ మధ్య ఈ చిత్రానికి ‘ఘాటీ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న సినిమా ఇది.

కొందరి వల్ల బాధితురాలైన ఓ మహిళ తర్వాత క్రిమినల్ గా మారి.. ఆపై ఆ ప్రాంతానికే రక్షకురాలిగా ఎలా ఎదిగింది అనే కోణంలో సాగే ఈ కథ.. ఆంధ్ర, ఒడిషా బార్డర్ లోని ఘాట్ రోడ్స్ ప్రాంతంలో సాగుతుందని చెప్పాడు దర్శకుడు క్రిష్. క్రిష్ డైరెక్షన్ లోనే 2010లో అనుష్క నటించిన వేదం ఆమెకు అద్భుతమైన అప్లాజ్ తెచ్చింది. ఇందులో సరోజ అనే వేశ్య పాత్రలో అద్భుతంగా నటించింది అనుష్క. బెస్ట్ యాక్ట్రెస్ అనుష్కకు, బెస్ట్ డైరెక్టర్ గా క్రిష్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తెచ్చింది వేదం.

ప్రస్తుతం అనుష్క ఇమేజ్, రేంజ్ వేరు. అయినా క్రిష్ తో సినిమాకు కమిట్ అయింది అంటే బలమైన కంటెంట్ ఉందనే భావించారు అంతా. బట్ ఈ మూవీకి సంబంధించి కొన్నాళ్లుగా ఏ అప్డేట్ లేదు. అసలు ప్రాజెక్ట్ ఉందా లేదా అనేది కూడా తెలియడం లేదు. షూటింగ్ లో ఉంటే కనీసం ఏదో ఒక అప్డేట్ అయినా వచ్చేది కదా అనేది అభిమానుల అభిప్రాయం. మరి ఘాటీ ఉందా లేదా అనేది మేకర్స్ క్లారిటీ ఇస్తే బెటర్.

Tags

Next Story