Pawan Kalyan : ఎన్ని చెప్పినా ‘హరిహర’ డౌటే అంటున్నారే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న మూవీ హరిహర వీరమల్లు. ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న చిత్రం ఇది. మొదట క్రిష్ డైరెక్షన్ లో స్టార్ట్ అయినా బాగా ఆలస్యం కావడంతో అతను తప్పుకున్నాడు. తర్వాతే ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఎంటర్ అయ్యాడు. అయితే మూవీ షూటింగ్ మాగ్జిమం పూర్తయిందని.. ఇంకా కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే అయిపోతుందని చెబుతూ వస్తున్నారు. అలాగే ఈ మార్చి 28న రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. బట్ ఆ టైమ్ కు రాదు అని చాలా వార్తలు వస్తున్నా.. నిర్మాత మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటున్నాడు. ప్రతి అప్డేట్ తో పాటు ఇదే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నాడు. ఆ మధ్య ఫస్ట్ లిరికల్ సాంగ్ అంటూ పవన్ కళ్యాణే పాడిన ‘మా వినాలి’అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను ఏఐ సాయంతో అన్ని భాషల్లో పవన్ కళ్యాణే పాడినట్టుగా రిలీజ్ చేశారు.
ఇక ఈ నెల 24న నిధి అగర్వాల్ తో కలిసిన డ్యూయొట్ ను సెకండ్ సింగిల్ గా విడుదల చేయబోతున్నాం అని చెప్పారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా సాగుతున్నాయంటున్నారు. అంచేత ఈ మార్చి 28న విడుదల కావడం ఖాయం అంటున్నారు. బట్ చూస్తే రిలీజ్ కు 40 రోజులు కూడా లేదు. ఈ టైమ్ లో పవన్ డేట్స్ ఇచ్చి షూటింగ్ చేసి చెప్పిన టైమ్ కు విడుదల చేయడం అంత సులువేం కాదు అనేది ఇంటర్నల్ గా వినిపిస్తోన్న మాట. ఇలా చేస్తే అయినా ఒత్తిడికి పవన్ వస్తాడు అనేది ఏఎమ్ రత్నం భావన అంటున్నారు. సో.. నిర్మాత ఎంత హడావిడీ చేస్తున్నా.. ఈ చిత్రం ఆ డేట్ కు రావడం కష్టమే అనేది ఓపెన్ గానే వినిపిస్తోన్న మాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com