కేరళలో టీ అమ్ముతున్న వ్యక్తి.. అచ్చంగా రజనీకాంత్ మాదిరిగా..

నటీనటుల స్టైల్ ని అనుకరించాలని చాలా మంది కోరుకుంటారు. అందునా తమిళ స్టార్ రజనీకాంత్ స్టైల్ గురించి చెప్పేదేముంది. ఆయన సినిమాల్లో ఎంత స్టైల్ గా ఉంటారో బయట అంత సాధారణంగా ఉంటారు. అయినా అందర్నీ ఆకర్షిస్తుంటారు. ఆయన నిరాడంబరతను చూసి ఆశ్చర్యపోయినా ఈ వయసులోనూ హిట్లిస్తున్న అతడిని చూసి యువ హీరోలు ఈర్ష చెందాల్సిందే.
కేరళలోని కొచ్చిన్‌లోని వెంకటేశ్వర హోటల్ యజమాని సుధాకర్ ప్రభుకి రజనీకాంత్ ఆహార్యం బాగా నచ్చింది. దాంతో అతడిలానే తన స్టైల్ ని మార్చుకున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ మాదిరిగా ఉన్న అతడిని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అతను సాధారణంగా టీ అమ్ముతూ, కస్టమర్లకు చిరునవ్వుతో సేవలందిస్తుంటాడు. అతడి దుకాణంలో రజనీకాంత్ సినిమాల్లోని ఫేమస్ డైలాగులు ట్యాగ్‌లైన్ లుగా కనిపిస్తాయి.
రజనీకాంత్ తాజా చిత్రం కొచ్చిన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న చిత్ర బృందం దృష్టిని ఆకర్షించింది. రజనీకాంత్ టీ అమ్ముతున్నట్లు కనిపించడం చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు. నాదిర్షా అనే మలయాళ దర్శకుడు వాటిని ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో అతని వీడియోలు వైరల్‌గా మారాయి. అప్పటి నుండి, అతను మరింత ఫేమస్ అయ్యాడు. దీంతో కేరళలోని వివిధ కార్యక్రమాలకు అతడిని ఆహ్వానించడం మొదలు పెట్టారు. కాగా రజనీకాంత్ సినిమా తదుపరి సీక్వెన్స్ లో నటించడం కోసం, అతను ప్రస్తుతం తిరునెల్వేలిలో ఉన్నారు.
సినీ విశ్లేషకుడు రమేష్ బాలా పంచుకున్న క్లిప్‌లో, అభిమానులు సుధకర్ తో మాట్లాడుతూ రజనీకాంత్ తమని పలకరించినట్లు ఫీలయిపోయారు. అక్టోబర్ 10న రజనీకాంత్ తన బృందంతో కలిసి 'తలైవర్ 170' రెండో షెడ్యూల్ కోసం తిరునల్వేలికి వచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com