Pushpa 2 : పుష్ప 2 ప్రెస్ మీట్ లో ఎన్నో అప్డేట్స్

ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ఎవరూ చేయని విధంగా మైత్రీ మూవీ మేకర్స్ ఒక స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమ సినిమాను దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్న వారందరితో కలిపి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీంతో ఈ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ లకు సంబంధించి వస్తోన్న అన్ని రూమర్స్ చెక్ పెట్టారు. అలాగే ఇవన్నీ ఫేక్ అని ప్రచారం చేస్తున్న వారి నోళ్లూ మూయించే ప్రయత్నం చేశారు. ఓ రకంగా ఈ ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ ప్రెస్ మీట్ లో అనేక అంశాలు వెళ్లడించారు నిర్మాతలు.. నవీన్, రవి శంకర్.
ఈ మూవీ ఆలస్యం కావడానికి కొంత గ్యాప్ రావడమే కారణం అనే అంశాన్ని ఒప్పుకున్నారు. జాతర ఎపిసోడ్ కోసం 50 కోట్ల వరకూ ఖర్చు చేశామనీ.. ఈ ఎపిసోడ్ ను 20 రోజులకు పైగా రిహార్సల్ చేసి, 35 రోజుల పాటు చిత్రీకరణ చేశాం అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ ను చెప్పాడు. అలాగే పుష్ప 3 కూడా ఉంటుందని.. సెకండ్ పార్ట్ లో అందుకు సంబంధించి లీడ్ ఉంటుందని ఫ్యాన్స్ కు ఊరించే అంశం చెప్పారు. అలాగే ఫస్ట్ లో తీసిన ఫుటేజ్ ఏదీ సెకండ్ పార్ట్ లో వాడలేదట.
ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ అయితే పుష్ప 2 నైట్ షోస్ తో పాటు కలెక్షన్లు, నంబర్ ఆఫ్ థియేటర్స్ విషయంలో బాహుబలి, కేజీఎఫ్ లను మించేలా ప్లాన్ చేశాం అన్నాడు. దీని ద్వారా ఇప్పటి వరకూ మరే ఇతర భాష హీరోకు లేనంత కలెక్షన్స్ ఈసారి అల్లు అర్జున్ కు వస్తాయని చెప్పాడు.
కేరళ డిస్ట్రిబ్యూటర్.. అక్కడ ఫస్ట్ డే 12 కోట్లు కలెక్ట్ చేయడమే టార్గెట్ గా.. 24 గంటలూ షోస్ ప్రదర్శించేందుకూ ప్రయత్నిస్తాం అన్నాడు. అలాగే నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఫస్ట్ పార్ట్ కు మించి ఇప్పటి వరకూ వచ్చిన ప్యాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్ దాటిపోయేలా పుష్ప 2 పర్ఫార్మ్ చేయబోతోందనే ధీమా వ్యక్తం చేశారు.
మొత్తంగా ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతూ ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ తో మైత్రీ మూవీ మేకర్స్ చాలామంది ఇన్ డైరెక్ట్ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇచ్చేశారనే చెప్పాలి. ఇక ముందు జరిగే ప్రెస్ మీట్ లో వీటికి సంబంధించిన ప్రశ్నలు తలెత్తే ఛాన్స్ లేదు. వచ్చినా ఆల్రెడీ చెప్పేశాం కదా అంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com