Aarya Ghare : స్మశానంలో బర్త్‌డే పార్టీ చేసుకున్న నటి..

Aarya Ghare : సమాజంలో పెరుగుతున్న మూఢనమ్మకాలను రూపుమాపేందుకు నటి ఆర్య ఘరే తన పుట్టినరోజును విభిన్నంగా జరుపుకోవాలని భావించారు. మరణం అనివార్యం. అది సత్యం. ఆ సత్యం స్మశాన వాటికతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశాన్ని అశుభంగా భావిస్తారు చాలా మంది. అది అశుభం ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తోంది నటి ఆర్య ఘరే. స్మశానవాటిక గురించి అపోహలు, మూఢనమ్మకాలను వదిలించుకోవడానికి, మీ పుట్టినరోజును స్మశానవాటికలో జరుపుకోండి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.
నిజానికి పుట్టినరోజంటే యువతకు పండగే.. స్నేహితులతో సరదాలు, పబ్‌ల్లో పార్టీలు. సరదాగా వీధుల్లో కేక్‌లు కట్ చేస్తూ కనిపిస్తారు. అయితే నటి ఆర్య ఘరే మాత్రం స్మశాన వాటికలో తన పుట్టినరోజును జరుపుకున్నారు. ప్రజలు శ్మశానవాటికకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఒక పవిత్ర స్థలం. అందరూ ఇక్కడికి రావాలన్నారు.
ఇక్కడ ఎవరికీ వివక్ష లేదు. ధనిక, పేద తారతమ్యాలు ఉండవు. ఇక్కడ కులతత్వం లేదు. అంతిమంగా అందరూ ఈ ప్రదేశానికి రావాలని కోరుకుంటారు. అందుకే ఇక్కడ పుట్టినరోజు జరుపుకున్నాను. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండండి. కానీ మూఢనమ్మకాలకు బలికావద్దు అని ఆర్య గారే సందేశం ఇచ్చారు.
నటి ఆర్య ఘరే తన పుట్టినరోజును స్మశానవాటికలో విభిన్నంగా జరుపుకుని వార్తల్లో నిలిచారు. ఆమె పుట్టినరోజు గురించి కూడా చర్చ జరుగుతోంది. మూఢనమ్మకాలు ఉండటం పెద్ద తప్పు అని ఆర్య చెప్పారు. సమాజంలో పెరిగిపోతున్న మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నమని ఆమె అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com