Marco Trailer : వాడు యుద్ధాన్నిడిక్లేర్ చేశాడు.. మార్కో తెలుగు ట్రైలర్

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద కంట్రీగా ఉన్న మూవీ మార్కో. గత వారం విడుదలైన ఈ మళయాలం మూవీలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు. ఇప్పటి వరకూ ఉన్ని ముకుందన్ కు అక్కడ హీరోగా పెద్ద క్రేజ్ ఏం లేదు. బట్ ఈ మూవీ తీసుకువచ్చింది. ఎంత అంటే ఓవర్ నైట్ మాస్ హీరో అయిపోయాడు. మోస్ట్ వయొలెంట్ మూవీగా మార్కోను అభివర్ణిస్తున్నారు అక్కడి ప్రేక్షకులు. రివ్యూస్ బావున్నాయి. అంతకు మించిన కలెక్షన్స్ వస్తున్నాయి. ఫుల్ రన్ లో 150 కోట్ట వరకూ రాబట్టే సత్తా ఉన్న సినిమా అంటున్నారు. అందుకే ఆ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. జనవరి 1న విడుదల కాబోతోన్న మర్కో తెలుగు ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేంత లేదు. కాకపోతే అంతా చెబుతున్నట్టుగా వయొలెంట్ యాక్షన్ తో మాత్రమే ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
‘‘జీవితంలో మనల్ని ఎక్కువగా హాంట్ చేసేందేంటో తెలుసా.. మనకు ఎంతో ఇష్టమైన వాళ్లని మన కళ్ల ముందే చిత్ర హింసలు పెట్టి చంపడం’’ అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ తర్వాత.. విలన్స్ చెబుతున్నట్టుగా.. ‘మార్కోతో మాట్లాడే ప్రతి మాటా జాగ్రత్తగా వాడాలి. ఈచ్ అండ్ ఎవిరీ ఒన్ కౌంట్స్’ అనే మాట ఆకట్టుకుంది. మనకే రిస్క్ ఉంది, వాడు యుద్ధాన్ని డిక్లేర్ చేశాడు.. లాంటి డైలాగ్స్ తో కనిపిస్తోందీ ట్రైలర్.
మామూలుగా ఇలాంటి సినిమాలకు అసలు మేటర్ ఏంటీ అనేది ముందే రివీల్ చేస్తే.. కిక్ పోతుంది. అందుకే కంప్లీట్ గా యాక్షన్ ప్యాక్డ్ గా ఈ ట్రైలర్ ను కట్ చేశారు అనుకోవచ్చు. అదే టైమ్ లో టైమ్ కూడా పెద్దగా లేదు కాబట్టి.. సడెన్ గా విడుదల చేస్తున్నారు కాబట్టే.. మళయాల ట్రైలర్ కే తెలుగు డైలాగ్స్ యాడ్ చేసినట్టుగానూ అనుకోవచ్చు. మొత్తంగా మార్కో మాలీవుడ్ లో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. మరి తెలుగులో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com