Unni Mukundan Marco : సెంచరీకి దగ్గరగా మార్కో రక్తపాతం

Unni Mukundan Marco :  సెంచరీకి దగ్గరగా మార్కో రక్తపాతం
X

మళయాల సినిమా అంటే సాఫ్ట్ వెర్షన్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్.. కొన్నాళ్లుగా ఇవి మాత్రమే చూస్తున్న ఆడియన్స్ కు ఊహించని షాక్ ఇచ్చాడు ‘మార్కో’. వెండితెరపై నెత్తురుటేరులు పారించిన సినిమా. ఇంత వయొలెంట్ మూవీ ఇప్పటి వరకూ ఇండియాలోనే రాలేదు అని చూసిన వాళ్లంతా చెప్పకున్న సినిమా. అయినా ఎమోషనల్ కనెక్షన్ ఉండటంతో ఆ వయొలెంట్ యాక్షన్ కు జనం బారులు కట్టారు. కట్ చేస్తే మాలీవుడ్ లో వచ్చిన రివ్యూస్ చూసి వెంటనే ఇతర భాషల్లో డబ్ అయింది. అన్ని చోట్లా అదే మాట. బాబోయ్ ఇంత వయెలెంట్ గా ఉందేంటీ అని. పైగా చూసిన వాళ్లంతా.. చిన్న పిల్లలు, గర్భిణీలు, సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు అస్సలు ఈ మూవీ వైపే రావొద్దు అని చెప్పడంతో అంతగా ఏముందబ్బా మూవీలో అంటూ చాలా మంది మార్కో ను చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు. అంటే ఆటో మేటిక్ గా కలెక్షన్స్ పెరిగినట్టే కదా.

ఇప్పటి వరకూ మళయాలంలో పెద్దగా మార్కెట్ లేని ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని హనీఫ్ అదేని డైరెక్ట్ చేశాడు. యుక్తి తరేజా, సిద్ధిఖీ, జగదీష్, కబీర్ సింగ్, ఇషాన్ షౌకత్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఫస్ట్ వీక్ లోనే మళయాలంలో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ 18 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల వరకరూ కలెక్ట్ చేసింది. ఉన్ని ముకుందన్ లాంటి హీరో వంద కోట్లు కొట్టడం అంటే.. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉన్న మూవీతో అంటే అదో రికార్డే కదా. అంతేకాక.. ఈ వెండితెర రక్తాభిషేకం ప్రేక్షకులకూ బాగా నచ్చిందనే కదా. సో.. కంటెంట్ లో దమ్ముంటే తెరంతా బ్లడ్ షెడ్ అయినా ఆడియన్స్ ఆదరిస్తారని ఈ మూవీ ప్రూవ్ చేసింది.

Tags

Next Story