Mark Antony : మాస్ లుక్ లో విశాల్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Mark Antony : మాస్ లుక్ లో విశాల్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
విశాల్ కొత్త ప్రాజెక్ట్ పై అప్ డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్

తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న హీరో విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ అప్ డేట్ వచ్చింది. ఆయన ప్రస్తుతం 'మార్క్ ఆంటోనీ' అనే యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మూవీలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే గిఫ్ట్ గా మేకర్స్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. 'మార్క్ ఆంటోనీ' నుంచి విశాల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. మాస్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపిస్తోన్న ఈ విశాల్ గ్లింప్స్ ఇప్పుడు అభిమానుల్ని ఎంతో ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా తన కొత్త సినిమా గురించిన సంగతులను విశాల్ ప్రత్యేకంగా వివరించారు. ''ఈ బర్త్ డే నాకెంతో స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే రానున్న సెప్టెంబర్ 15న 'మార్క్ ఆంటోని' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పటి వరకు నేనేన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాల్లో నటించాను. ఆడియెన్స్ నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే వచ్చారు. వారు అందించిన ఆదరాభిమానాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. నాపై ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రేకకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పారు.

'' 'మార్క్ ఆంటోని' విషయానికి వస్తే నా కెరీర్లో ఇదెంతో ముఖ్యమైన సినిమా. పీరియాడిక్ మూవీ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాను. ఆ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ కి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓ కీలకమైన పాత్రలో ఎస్.జె.సూర్యగారు నటించారు. జి.వి.ప్రకాష్ గారు సంగీతాన్ని అందిస్తున్నారు. జి.వి. మ్యూజిక్ తో పాటు అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ.. పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ ఫైట్స్ హైలైట్. థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులు ఎలాంటి సినిమాను చూడాలనుకుంటున్నారో అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉంటాయి. తప్పకుండా ఆడియెన్స్ కి ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ను మార్క్ ఆంటోని మూవీ ఇస్తుంది. మీ ప్రేమ, అభిమానాలుంటే ఇలాంటి సినిమాలను ఇంకా మరెన్నింటినో చేసి మిమ్మల్ని మరింతగా అలరిస్తానని చెబుతున్నాను '' అని విశాల్ తెలిపారు.

ఈ చిత్రాన్ని మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్‌ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో 'పెళ్లి చూపులు' ఫేం రీతూవ‌ర్మ (Ritu Varma) ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. విశాల్ మరోవైపు స్వీయ‌ దర్శకత్వంలో 'తుప్పరివాల‌న్ 2' మూవీ చేస్తున్నాడు. ఈ డిటెక్టివ్ ఫిల్మ్‌ను హోంబ్యాన‌ర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ స్వయంగా నిర్మిస్తున్నాడు. విశాల్ 34కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


Tags

Read MoreRead Less
Next Story