నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను.. నీహారిక

మెగా బ్రదర్ నాగబాబు (Konidela Nagababu) కూతురు నిహారిక (Konidela Niharika) రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) 2020లో నీహారికను పెళ్లాడాడు.. కానీ రెండేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత ఇద్దరూ దీనిపై ఎక్కడా స్పందించలేదు. విడాకులకు గల కారణాలను వెల్లడించలేదు. అయితే ఇప్పుడు తొలిసారిగా తన పెళ్లి, విడాకుల గురించి నిహారిక వెల్లడించింది. పెళ్లి చేసుకునే ముందు ఒకరినొకరు తెలుసుకోవాలి. మనకు తెలియకుండా మనకి సంబంధం లేని వారిపై ఆధారపడకూడదు. ఆ ఇంట్లో వాళ్ళు మనల్ని అమ్మా నాన్నలా చూసుకోరు. అంత ప్రేమ చూపించలేరు అని ఆమె చెప్పింది. విడాకుల తర్వాత ఎవరిపై ఆధారపడకుండా ఒంటరిగా ఉండడం నేర్చుకున్నానని చెప్పింది.
పెళ్లి తర్వాత నటనకు దూరంగా...
పెళ్లి కారణంగా సినిమాల్లో నటించడం మానేశానని అందరూ అనుకుంటున్నారు. అయితే అది కారణం కాదు... నిర్మాతగా బిజీ కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చాను. మా వదిన లావణ్యను (Lavanya Tripathi) కూడా అదే ప్రశ్న అడిగారు. అది మా వృత్తి. మేం ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి? అని ప్రశ్నించింది.
విడాకుల తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు మెగా కూతురు. కొంత మంది జీవితాంతం కలిసి ఉండేందుకు పెళ్లి చేసుకుంటారు. ఏడాదిలోపు విడిపోతారని తెలిసి ఎవరూ అంత ఖర్చుపెట్టి పెళ్లి చేసుకోరు. కానీ అనుకున్నది ఏదీ జరగదు. నా గురించి ఏం రాసినా పట్టించుకోను. కానీ నన్ను తప్పుగా చిత్రీకరించడం చాలా బాధిస్తుంది. ఇటువంటప్పుడు బాగా ఏడ్చేదానిని అని ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటివి భరించడం అంత తేలిక కాదు. అలాగే నా కుటుంబం గురించి కూడా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు నేను తట్టుకోలేకపోయాను. కానీ నా కుటుంబం నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. విడాకులు తీసుకున్న ఈ రెండేళ్లలో కుటుంబం విలువ తెలిసింది అని నీహారిక వెల్లడించింది.
పెళ్లి, విడాకుల తర్వాత ఎవరినీ నమ్మకూడదని నేర్చుకున్నానని చెప్పింది నీహారిక. ఇది తనకు గుణపాఠమని ఆమె అన్నారు. తాను ఎప్పటికీ ఒంటరిగా ఉండనని... తన వయసు 30 ఏళ్లు మాత్రమేనని చెప్పింది. మంచి వ్యక్తి దొరికితే మళ్లీ పెళ్లి చేసుకుంటానని కొణిదెల నిహారిక స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com