Mass Jathara : ఓటిటి రిలీజ్ డేట్ కు మాస్ జాతర

Mass Jathara :  ఓటిటి రిలీజ్ డేట్ కు మాస్ జాతర
X

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ మాస్ జాతర. ఇది అతనికి 75వ సినిమా కావడం విశేషం. శ్రీలీల హీరోయిన్ గా నటించిన మూవీ కావడంతో అంచనాలున్నాయి. బట్ ఆ అంచనాలు అందుకోవడంలో మాస్ జాతర విఫలమైంది. కమర్షియల్ సక్సెస్ గా ఈ చిత్రం సక్సెస్ కాలేదు. రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం కావడంతో కొత్తదనం ఆకట్టుకుంది ఆడియన్స్. ఆ విషయంలో మాత్రం విఫలమైంది చిత్రం.

కథగా చూస్తే.. వరంగల్ ప్రాంతంలో రైల్వే పోలీస్ గా ఉన్నాడు హీరో లక్ష్మణ్ భేరి. అతనికి అడవివరం అనే ఊరికి ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఆ ఊరిలో కొందరు గంజాయి సాగు చేస్తుండటం, వేరే రాష్ట్రాల్లో ఆ ప్రాంతంలో గంజాయిని తరలించడానికి చేస్తుండటం శివుడును అడ్డుకుంటాడు లక్ష్మణ్. మరి ఈ క్రమంలో వారి మధ్య ఎలాంటి గొడవలు సాగుతుంటాయి. అందుకోసం హీరో చేసిన ప్రయత్నాలు ఎలా ఉంటాయి అనేది మిగతా కథ. ఈ కథలో కొత్తదనం లేకపోవడంతో కొన్నాళ్లుగా దర్శకుడు ఫెయిల్ అయిపోయాడు. రవితేజ కూడా కొన్నాళ్లుగా ఫెయిల్యూర్స్ చూస్తుండటం కొనసాగింపుగా కనిపిస్తోంది.

నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ 28 నుంచి ఓటిటిలో విడుదల కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం ప్రదర్శితం కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాలం లో కూడా ఓటిటిలో స్ట్రీమ్ అవుతుంది మూవీ. మరి ఓటిటి నుంచి మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.

Tags

Next Story