Ravi Teja : మాస్ రాజా క్రాక్ చూపుతాడా

మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్. ఈ 26న రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ మాస్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ముందుగానే ఈ గ్లింప్స్ గురించి ఎక్స్ ప్లోజివ్ గ్లింప్స్ అన్నారు. మరీ అంత లేదు కానీ ఆకట్టుకునేలా ఉంది. వింటేజ్ రవితేజ మేనరిజంస్ తో పాటు అతనిలోని మాస్ యాంగిల్ ను కొత్త కోణంలో చూపించబోతున్నారు అనేలా కనిపిస్తోంది. గ్లింప్స్ లో మరో క్యారెక్టరే ఎలివేట్ కాకుండా పూర్తిగా రవితేజ బర్త్ డే స్పెషల్ గానే కనిపించింది.
ఇక రవితేజ ఈ చిత్రంలో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అని అర్థం అవుతోంది. పోలీస్ గా నటించిన విక్రమార్కుడు అతని కెరీర్ లోనే ది బెస్ట్ అంటారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చి క్రాక్ మూవీలో పోలీస్ పాత్ర మరో మైల్ స్టోన్ లా నిలిచింది రవితేజకు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన క్రాక్ రవితేజకు లాస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన చాలా మూవీస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. దీంతో మరోసారి ఖాకీ డ్రెస్ తో వస్తున్నాడు కాబట్టి మళ్లీ బాక్సాఫీస్ కు తన క్రాక్ చూపించేలానే ఉన్నాడనేలా ఉంది గ్లింప్స్. మాస్ అండ్ క్లాస్ ను ఆకట్టుకునే అంశాలు చాలానే ఉండబోతున్నాయనిపిస్తోంది. పైగా రవితేజ తను ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తే ఏవో కొన్నిసార్లు తప్ప ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు. భాను భోగవరపు ఇంతకు ముందు సామజవరగమనా చిత్రానికి రచయిత. ఆ మూవీలో అతని రైటింగే హైలెట్. అందుకే దర్శకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు రవితేజ.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ మాస్ జాతర రవితేజ ఫ్యాన్స్ కు క్రాక్ తెప్పించేలానే ఉందని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com