Raviteja : రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి

మాస్ మహరాజ్ రవితేజ మారాడు. తన క్యారెక్టర్ ను మార్చుకున్నాడు. తను చుట్టూ ఉన్న వాళ్లంతా మారాలని కోరుకుంటున్నారు. వారి కోసం తనే మారబోతున్నాడు.ముఖ్యంగా భార్యల విషయంలో. వారంతా బావుండాలని కోరుకుంటున్నారు.. భర్త మహాశయులకు విజ్ఞప్తి అని చెప్పబోతున్నాడు. యస్.. అతని కొత్త సినిమా టైటిల్ ను అలాగే పెట్టారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ తో సినిమా ప్రకటించారు తాజాగా. ఈ మేరకు విడుదల చేసిన గ్లింప్స్ కూడా ఆకట్టుకోలేదు.
ఈ టైటిల్ తో బాగా ఆకట్టుకుంటోంది. రవితేజ ఇమేజ్ కు సరిపోయే కథతోనే రూపొందబోతోన్న సినిమా అనిపించేలా ఉంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే వ్యక్తితోనే కథ నలిగిపోయేలా ఉందనిపిస్తోంది. భక్త మహాశయులకు విజ్నప్తి అనే డైలాగ్ వినాలి ఉంటాం మనం. కానీ అలాంటి వ్యక్తి ఇద్దరు ఆడవాళ్లు ఉండేలా రామ సత్యనారాయణ కోరుకుంటూ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ప్రకటించారు.
మాస్ రాజా రవితేజ హీరోతో పాటు అషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునిల్, వెన్నెల కిశోర్, సుధాకర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతికి విడదల చేయబోతున్నట్టు అని ప్రకటించారు మేకర్స్. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. మొత్తంగా మంచి టైటిల్ తో పాటు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మేకర్స్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

