Raviteja : మాస్ మహరాజ్ జాతర డేట్ మార్చారా..?

Raviteja :  మాస్ మహరాజ్ జాతర డేట్ మార్చారా..?
X

ఏ సినిమాకైనా కరెక్ట్ రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డేట్ ను బట్టే ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లాంటి సీజన్ లో. మొదట సమ్మర్ నే టార్గెట్ చేసిన మాస్ మహారాజ్ రవితేజ తాజాగా రిలీజ్ డేట్ మార్చుకున్నాడు. అతను నటిస్తోన్న మూవీ ‘మాస్ జాతర’ను మే 9న విడుదల చేయాలనుకున్నారు. అదే రోజున పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా వస్తుండటంతో క్లాష్ ఎందుకు అనుకున్నారేమో.. పోస్ట్ పోన్ చేశారు.

ధమాకా తర్వాత శ్రీ లీల మరోసారి రవితేజ సరసన నటించిన సినిమా మాస్ జాతర. భాను భోగవరపు దర్శకుడు. కంప్లీట్ గా రవితేజ స్టైల్లోనే ఉంటూ.. క్రాక్ తరహా పోలీస్ స్టోరీతో ఓ ఇంటెన్సిటీ ఉన్న కథ అంటున్నారు. కొన్నాళ్లుగా రవితేజకు సరైన హిట్ పడటంలేదు. కథలు మార్చాడు. దర్శకులను మార్చాడు. సరికొత్త ప్రయత్నాలూ చేశాడు. బట్ ఏదీ వర్కవుట్ కావడం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ కథపై మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఇక ఈ చిత్రాన్ని జూలై 18న విడుదల చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇది మూవీ టీమ్ నుంచి అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోన్న వార్త మాత్రమే. నిజానికి రవితేజ లాంటి మాస్ హీరో స్కూళ్లు, కాలేజ్ లు స్టార్ట్ అయిన తర్వాత వస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ సమ్మర్ లోనే మరో డేట్ చూసుకుని వస్తే మంచి విజయం సాధించే ఛాన్స్ లు ఎక్కువగా ఉంటాయి.

Tags

Next Story