Raviteja : మాస్ రాజా మొత్తం కంప్లీట్ చేశాడు..

Raviteja   :   మాస్ రాజా మొత్తం కంప్లీట్ చేశాడు..
X

మాస్ మహరాజ్ రవితేజ దూకుడు మామూలుగా లేదు. యేడాదికి మూడు సినిమాలు అని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. 2022లో మూడు, 2023లో మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ యేడాది ఈగల్ తో వచ్చాడు. నెక్ట్స్ మిస్టర్ బచ్చన్ తో రాబోతున్నాడు. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. రైడ్ అనే బాలీవుడ్ మూవీకి రీమేక్ ఈ బచ్చన్ మూవీ. అయితే ఆగస్ట్ 15 బరిలో అనూహ్యంగా నిలిచిన ఈ మూవీతో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే కలర్ కనిపిస్తోంది రవితేజలో.

ఇప్పటి వరకూ వచ్చిన రెండు పాటలు ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని గంటల్లో టీజర్ కూడా రాబోతోంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అంటే అప్పటికే ట్రైలర్ కూడా విడుదల చేస్తారన్నమాట. ఇక ఈ మూవీకి సంబంధించి రవితేజ లేటెస్ట్ గా డబ్బింగ్ మొత్తం కంప్లీట్ చేశాడు. మామూలుగా మాస్ రాజా డబ్బింగ్ కు ఎక్కువ టైమ్ తీసుకోడు. హరీశ్ శంకర్ లాంటి డైరెక్టర్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. అందుకే అనుకున్న దానికంటే వేగంగానే డబ్బింగ్ కూడ కంప్లీట్ అయిపోయింది. ఇక టీజర్ తో మొదలుపెట్టి సినిమా వచ్చే వరకూ ప్రమోషన్స్ తో హోరెత్తించబోతున్నారన్నమాట. ఏదేమైనా మాస్ రాజా దూకుడు బలే ఉంది కదా..

Tags

Next Story