Ravi Teja Mass Jathara : మాస్ జాతర నుంచి మాస్ గ్లింప్స్ రెడీ

Ravi Teja Mass Jathara :  మాస్ జాతర నుంచి మాస్ గ్లింప్స్ రెడీ
X

మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా 'మాస్ జాతర'. మనదే ఇదంతా అనేది క్యాప్షన్. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ను బట్టే ఎలాంటి గ్లింప్స్ రాబోతోందో ఊహించుకోవచ్చు.ఓ భారీ విస్ఫోటనం లాంటి యాక్షన్ తో ఈ గ్లింప్స్ ఉంటుందని కూడా చెప్పారు మేకర్స్. దీనికి తగ్గట్టుగానే ఆ పోస్టర్ కనిపిస్తోంది. ఇక ఈ గ్లింప్స్ ను ఈ నెల 26న రవితేజ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేయబోతున్నారు. అంటే ఈ సారి బర్త్ డే బ్లాస్టింగ్ గా ఉండబోతోందన్నమాట.

భోజనానికి రెడీగా ఉన్న రవితేజ చాలా కోపంగాచూస్తూ మీసం మెలేస్తున్నాడు. ఆ పక్కన పాత్రల్లో కత్తులు, ఆయుధాలు ఉన్నాయి. ఈ పోస్టర్ చూస్తోంటే కేవలం యాక్షన్ మాత్రమే కాక సినిమాలో ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉండబోతున్నాయని అర్థం అవుతోంది. రవితేజ ఈ మధ్య వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ప్రతిసారీ కొత్త కంటెంట్ తో వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కానీ.. కమర్షియల్ గా వర్కవుట్ కావడం లేదు. కానీ ఈ సారి గ్యారెంటీగా హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తోంది. అందుకు కారణం ఈ మూవీ హిట్ మెషీన్ లా మారిన సితార బ్యానర్ నుంచి వస్తుండటమే.

ఇక ధమాకా తర్వాత శ్రీ లీల మరోసారి మాస్ రాజాతో జోడీ కట్టిన ఈ చిత్రానికి ధమాకా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Tags

Next Story