CRIME: నా కొడుకు దగ్గర న్యూడ్ వీడియోలు ఉన్నాయ్

లావణ్య-రాజ్ తరుణ్‌ల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా మస్తాన్ సాయి ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా లావణ్యపై మస్తాన్ సాయి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా కొడుకు దగ్గర న్యూడ్ వీడియోలు ఉన్న మాట నిజం, కానీ.. అవి అతని భార్య వీడియోలు మాత్రమే. పెళ్లైన నా కొడుకును మళ్లీ పెళ్లి చేసుకోవాలని లావణ్య వేధించింది. రూ.12 కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేసింది. నా కొడుక్కి డ్రగ్స్ కూడా లావణ్యనే అలవాటు చేసింది. ’ అని ఆరోపించారు.
గవర్నర్‌కు ఫిర్యాదు...
మస్తాన్ సాయి కేసుపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది నాగూరుబాబు లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది కోరారు.
లీకవుతున్న వీడియోలు...
మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల కేసులో రోజుకో వీడియో లీకవుతూ కలకలం రేపుతూనే ఉంది. లావణ్యతో పరిచయం కారణంగా ఓ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు పడింది. కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్‌కు వచ్చిన లావణ్యతో పరిచయం పెంచుకోని ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడుతూ, తరచూ చాటింగ్ చేస్తుండటంతో సీపీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా డీఐ ఇరుక్కోవడం సంచలనంగా మారింది.
ఏం మాట్లాడుకున్నారంటే..
డీఐతో లావణ్య మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. "నాది గుండె కాదు.. రాయి గుండె అని అర్థం చేసుకోండి. డిస్ట్రబ్ చేస్తున్నానా నేను మిమ్ముల్ని" అని లావణ్య డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడింది. తాను ఆ 11 కి.మీ లిమిట్స్ దాటి వస్తే ఏం చేస్తారు అంటూ లావణ్య ప్రశ్నించడంతోపాటు నేను అక్కడికి రావద్దా అంటూ పదే పదే అడగడం ఆ వీడియో కాల్ లో రికార్డ్ అయింది. నేను ఊరికే ఫోన్ చేస్తున్న కదా.. క్షమించండి.. బై అంటూ లావణ్య మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com