Mathu Vadalara 2 : బొమ్మ బ్లాక్ బస్టరే.. కానీ..

ఏ సినిమా విజయం అయినా కమర్షియల్ కొలమానాల్లోనే చూస్తాం. బడ్జెట్ ను దాటి ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అంత పెద్ద హిట్టు అని చెప్పొచ్చు. అలా చూస్తే ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమా మత్తు వదలరా 2 బిగ్గెస్ట్ హిట్ గా డిక్లేర్ అయింది. గత వారమే విడుదలైన ఈ మూవీ మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పెరిగాయి. విజయవంతంగా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయింది. వారం రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచ వ్యాపతంగా 24 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వావ్ అనిపించింది. చిన్న సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీ ఎక్కువ హ్యాపీగా ఉంటుందనేది నిజం. ఆ మేరకు ఈ మధ్య కమిటీ కుర్రోళ్లు, ఆయ్ తర్వాత మత్తు వదలరా మంచి విజయాలు నమోదు చేసి కొత్త జోష్ ను తెచ్చాయి.
అయితే ఈ సినిమా పెద్ద హిట్ అయినా.. హీరోలో ఆ ఆనందం కనిపించడం లేదు అనేది నిజం. ఎందుకంటే సినిమా చూసిన ప్రత ఒక్కరూ.. కమెడియన్ సత్య గురించే మాట్లాడుకుంటున్నారు. అతను లేకపోతే సినిమానే లేదు అన్నంతగా మాట్లాడుకుంటున్నారు. మత్తు వదలరా 2 విజయంలో సత్యదే మేజర్ షేర్ అంటున్నారు. విశేషం ఏంటంటే సినిమాలోనే కాదు.. ప్రమోషన్స్ లో కూడా సత్యనే హైలెట్ అవుతున్నాడు. తనదైన టైమింగ్ తో ఏం చేసినా తనే అప్పర్ హ్యాండ్ అవుతున్నాడు. దీంతో హీరో శ్రీ సింహాకు సినిమా హిట్ అయినా పూర్తి స్థాయిలో ఆస్వాదించే సిట్యుయేషన్ లేదు. అందుకే వెంటనే సోలోగా ఓ హిట్ కొడితే తప్ప ఈ బాధ పోదు అంటున్నారు చాలామంది.
రితేష్ రాణా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా పాత్రకూ మంచి పేరొచ్చింది. అమ్మాయిలోనూ మంచి టైమింగే ఉంది. మొత్తంగా భారీ విజయం సాధించినట్టే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com