Mathu Vadalara 2 Teaser : అది దొంగతనం కాదు.. తస్కరించుట

Mathu Vadalara 2 Teaser :   అది దొంగతనం కాదు.. తస్కరించుట
X

కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన సినిమా మత్తు వదలరా. 2019లో విడుదలై మంచి విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు మత్తు వదలరా 2 వస్తోంది. రెండు పార్ట్స్ కూ రితేష్ రాణానే దర్శకుడు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఫస్ట్ పార్ట్ లో కీలక పాత్రలు చేసిన వాళ్లంతా ఇందులోనూ కనిపిస్తున్నారు. టీజర్ ను బట్టి ఈ సారి డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపిస్తోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించడంతో దర్శకుడు మరింత స్వేచ్ఛగా కనిపిస్తున్నాడు. సినిమా అంతా హిలేరియస్ గా ఉండేలా కనిపిస్తోంది.

హి టీమ్ అనే దానికి మెడ్ గా రోహిణి కినిపిస్తోంది. హి అంటే ఇంగ్లీష్ లెటర్స్ ప్రకరారం హై ఎమర్జెన్సీ.. అని అర్థం. ఈ టీమ్ అంతా కలిసి వరుస దొంగతనాలు చేస్తోన్న శ్రీ సింహా, సత్యను పట్టుకోవడమే టార్గెట్ గా పనిచేస్తుంది. అదే టీమ్ లో హీరోయిన్ ఫారియా అబ్దుల్లా కూడా కనిపిస్తోంది. అనుకోకుండా హీరోతో పరిచయం అవుతుంది. ఆతర్వాత వారినే తను పట్టుకోవాలని తెలుస్తుంది. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలేంటీ అనేది సినిమా అనుకోవచ్చు.

టీజర్ లో ఓ చోట ఫారియా ఆ ఇద్దరినీ అంటుంది.. దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా అని. దానికి సత్య తనదైన టైమింగ్ తో అయినా అది దొంగతనం కాదు.. తస్కరించుట అంటాడు. ఇలాంటి పంచ్ లే టీజర్ అంతా ఉన్నాయి. చూస్తోంటే మరోసారి థియేటర్ మొత్తం నవ్వించడం గ్యారెంటీ అనేలా ఉంది.

Tags

Next Story