Varun Tej : మట్కా ట్రైలర్ .. పులుల్ని ఆడించే రింగ్ మాస్టర్

Varun Tej :  మట్కా ట్రైలర్ .. పులుల్ని ఆడించే రింగ్ మాస్టర్
X

వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సినిమా మట్కా. కరుణకుమార్ దర్శకుడు. నవంబర్ 14న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. పీరియాడిక్ మూవీ పలాసతో బాగా ఆకట్టుకున్నాడు దర్శకుడు కరుణ కుమార్. కానీ ఆ తర్వాత విజయాలు లేవు. ఇటు వరుణ్ తేజ్ కూడా హిట్ కొట్టి చాలాకాలం అయింది. అందుకే ఈ కాంబోలో సినిమా అన్నప్పుడు కొంత అనుమానపడ్డారు. బట్.. మూవీపై అంచనాలు పెంచడంలో కొంత సక్సెస్ అయ్యారు. మరి ఈ ట్రైలర్ తో అవి రెట్టింపు అవుతాయా అనేది చూద్దాం.

1960ల నేపథ్యంలో సాగే కథ మట్కా. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అప్పట్లో ఈ మట్కా వ్యాపారం జోరుగా సాగింది. అక్రమంగా డబ్బు సంపాదించడానికి, ఓవర్ నైట్ లక్షాధికారులు కావాలనుకున్నవాళ్లంతా మట్కాలోకి దిగేవారు. అలా ఎంటర్ అయ్యి ఆ బిజినెస్ లో తిరుగులేని కింగ్ గా ఎదిగిన ఓ వ్యక్తి కథగా కనిపిస్తోందీ మూవీ. ట్రైలర్ ప్రామిసింగ్ గానే ఉంది. వరుణ్ తేజ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ తో కనిపిస్తుండటం మరింత ఆసక్తిగా ఉంది. మీనాక్షి లక్కీ భాస్కర్ లోని పాత్రనే అంతకు ముందే చేసిందా అన్నట్టుగా ఉందీ రోల్. వీరితో పాటు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా ఓ కీలక పాత్రలో నటించింది. తన క్యారెక్టర్ ఏంటీ అన్నది ట్రైలర్ లో రివీల్ కాలేదు. బట్ ఈ ట్రైలర్ లో డైలాగ్స్ బావున్నాయి. మీనింగ్ ఫుల్ గా కనిపిస్తున్నాయి.

బట్ ట్రైలర్ మొత్తంలోనూ అత్యంత పేలవంగా ఉంది జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. చాలా అంటే చాలా నీరసంగా అనిపించింది. పీరియాడిక్ మూవీ కాబట్టి అలా చేశాడా అనుకున్నా.. ఆయా సీన్స్ ను హైప్ చేయడంలో అప్పట్లోనూ మంచి సంగీతమే ఉంది కదా. అందుకే అతని నేపథ్య సంగీతం సినిమాకు కొంత మైనస్ కావొచ్చేమో అన్నట్టు ట్రైలర్ లోనే కనిపిస్తోంది.

వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోర ఫతేహితో పాటు నవీన్ చంద్ర, కన్నడ కిశోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపీ కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ హీరోతో పాటు దర్శకుడికీ కీలకమే. మరి విజయాన్ని అందుకుంటారా లేదా అనేది చూడాలి.

Tags

Next Story