Subham vs Single : మే 9 ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయో తెలుసా..?

Subham vs Single :  మే 9 ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయో తెలుసా..?
X

ఈ వేసవి టాలీవుడ్ కు మాగ్జిమం నిరాశనే మిగిల్చింది. ప్రతి వారం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకునేవే కనిపించడం లేదు. ఈ నెల హిట్ 3 తో కాస్త గ్రాండ్ గానే మొదలైంది. ఇక ఈ 9న కూడా మరికొన్ని సినిమాలు సందడి చేయబోతున్నాయి. వీటిలో సమంత నిర్మించి కేమియో రోల్ లో నటించిన సినిమా ‘శుభం’కాస్త ఎక్కువ అటెన్షన్ సంపాదించుకుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ ప్రీమియర్స్ 100 పర్సెంట్ ఆక్యుపై అవుతున్నాయి. చూసినవాళ్లంతా బావుందని చెబుతున్నారు.

శ్రీ విష్ణు నటించిన సింగిల్ 9నే విడుదలవుతోంది. శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవనా హీరోయిన్లుగా, వెన్నెల కిశోర్ మరో ప్రధాన పాత్రగా నటించారు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శ్రీ విష్ణు రేంజ్ కంటెంట్ లా కనిపిస్తోంది. ఆడియన్స్ ను నవ్వించడమే ప్రధానంగా రూపొందిన సినిమాలా కనిపిస్తున్నా.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలోని ఎమోషన్స్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి.

ఈ రెండు సినిమాలతో పాటు కలియుగమ్, సిఎమ్ పెళ్లాం, మహాబలి 1980స్ అనే చిత్రాలు విడుదలవుతున్నాయి. కానీ వీటిని పెద్దగా పట్టించుకుంటారా అనేది చెప్పలేం.

అయితే అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకుంటోంది మాత్రం మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్. ఈ చిత్రాన్ని ఏకంగా 8 కేలో అప్డేట్ చేశారు. త్రీడీలోనూ రూపొందించారు. 1990లో ఇదే నెల ఇదే డేట్ కు విడుదలైన ఈ చిత్రాన్ని మరోసారి అదే డేట్ కు విడుదల చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ ఎపిక్స్ లో ఖచ్చితంగా చోటు సంపాదించుకున్న ఈ మూవీ ఈ జెనరేషన్ ఆడియన్స ను కూడా మెస్మరైజ్ చేస్తుందనే చెప్పాలి.

టాలీవుడ్ కే స్పెషల్ అయిన జగదేకవీరుడు అతిలోకసుందరిని మినహాయిస్తే మొత్తంగా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. మరి వీరిలో సాలిడ్ గా బాక్సాఫీస్ పోటీ అంటే శుభం వర్సెస్ సింగిల్ అనే చెప్పాలి.

Tags

Next Story