Maya Sabha trailer : మయసభ ట్రైలర్.. బయోపిక్ లాంటి బయోపిక్

Maya Sabha trailer :  మయసభ ట్రైలర్.. బయోపిక్ లాంటి బయోపిక్
X

మయసభ.. కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా ఉంటోందీ మూవీ. ఆ మధ్య వచ్చిన టీజర్ తో పాటు ఓ స్నీక్ పీక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవా కట్టా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా హీరో సాయిదుర్గాతేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు సీనియర్ పొలిటీషియన్స్ కథలా కనిపిస్తున్నా.. దీన్ని బయోపిక్ అనడానికి లేదు అన్నంత క్లెవర్ గా డిజైన్ చేసినట్టున్నాడు దేవా కట్టా. చూడగానే ఆ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది. కానీ పేర్లు మార్చాడు. ప్రాంతాల పేర్లూ మార్చాడు. ఇందిరాగాంధీ, సీనియర్ ఎన్టీఆర్ పాత్రల్లాగానూ ఉన్నాయి. కానీ వేరే పేర్లు. అందుకే ఇది బయోపిక్ లాంటి బయోపిక్ అన్నది.

ఇక ఈ ఇద్దరు నాయకులు యంగ్ స్టర్స్ ఉన్నప్పుడు ఓ అనుకోని ప్రమాదం వల్ల కలుసుకుంటారు. తర్వాత రాజకీయాల్లోకి వస్తారు. ఒకరు డాక్టర్ అవుతారు. మరొకరు పి.హెచ్.డి చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆపై రాజకీయాల్లో ఎదిగేందుకు రకరకాల సలహాలు, సూచనలు వింటుంటారు. తర్వాత వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి. కలిసి ప్రయాణం మొదలుపెట్టిన ఇద్దరూ ప్రత్యర్థులుగా ఎలా మారారు అనే కోణంలో సాగే కథలా కనిపిస్తోంది. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చంద్రబాబును పోలిన పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్ఆర్ ను పోలిన పాత్రలో చైతన్య రావు నటించారు. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూవీ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమ్ కాబోతోంది. మరి ఇది కేవలం ఒకే పార్ట్ సినిమానా లేక సిరీసా అనేది రిలీజ్ అయితే కానీ తెలియదు.

Tags

Next Story