Mazaka movie : మజాకా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..?

సందీప్ కిషన్, రావు రమేష్, రీతూవర్మ, అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మజాకా. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన సినిమా ఇది. రిలీజ్ కు ముందు భారీ ప్రమోషన్స్ చేశారు. థియేటర్స్ ఆడియన్స్ పడిపడి నవ్వుతారు అని చెప్పారు. బట్ రివ్యూస్ చూస్తే మిక్స్ డ్ గా ఉన్నాయి. చాలా నాసిరకమైన రైటింగ్ గా చెప్పారు చాలామంది. ఒకట్రెండు ట్విస్ట్ లు మినహా ప్రతి సీన్ ఎక్స్ పెక్ట్ చేసినట్టుగానే ఉన్నాయని తేల్చారు. ఎలాంటి కాన్ ఫ్లిక్ట్ లేకుండా అవుట్ డేటెడ్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లేతో వచ్చిన సినిమా అని చాలా రివ్యూస్ లో ఉన్నాయి. ముఖ్యంగా అస్సలే మాత్రం లాజిక్ లే లేని సినిమా అన్నారు. మరి అలాంటి మూవీకి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ వచ్చిందనే ఆసక్తి అందర్లోనూ ఉంటుంది కదా..
మజాకాకు ఫస్ట్ డే కేవలం 3 కోట్లు మాత్రమే వచ్చాయి. సందీప్ కిషన్ ఈ మూవీ తన కెరీర్ లో పెద్ద ఓపెనింగ్స్ తెస్తుందనుకున్నాడు. బట్ అలా ఏం జరగలేదు. మౌత్ టాక్ కూడా ఏమంత గొప్పగా లేదు. ఆ కారణంగానే చాలా డల్ గా ఓపెన్ అయింది. దీనికి తోడు శివరాత్రి జాగారం వల్ల కూడా సినిమాకు మైనస్ అయిందంటున్నారు. మరి ఈ వీకెండ్ లో ఇంకేమైనా పికప్ అవుతుందేమో కానీ.. బ్రేక్ ఈవెన్ కు వీళ్లు ఇంకా 10 కోట్లకు పైనే కలెక్ట్ చేయాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com