Sandeep Kishan : ట్రైలరే ఇంత రొటీన్ గా ఉంటే మజాకా ఎలా..?

సందీప్ కిషన్, రావు రమేష్ హీరోలుగా నటించిన సినిమా 'మజాకా'. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రీతూ వర్మ, అన్షు హీరోయిన్లు. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. ఈ నెల 26న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. సందీప్ కిషన్ కు ఇది 30వ సినిమా. అందుకే కాస్త కొత్తగా ఎంటర్టైనింగ్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు అని చెబుతూ వస్తున్నాడు. కొన్నాళ్లుగా అన్నీ యాక్షన్ మూవీసే చేస్తున్నాను.. అందుకే కామెడీ కూడా చేయగలను అని నిరూపించుకునేందుకే ఈ సబ్జెక్ట్ అని కూడా అన్నాడు. అయితే ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత కామెడీ అని వీళ్లనుకునే వ్యవహారం అంతా పరమ రొటీన్ గా ఉంది అనే ఫీలింగ్ వస్తే ఆశ్చర్యమేం లేదు.
సింపుల్ గా చెబితే పెళ్లీడుకొచ్చిన కొడుకు ఉన్న ఓ తండ్రి తన కూడా ఓ మహిళను ప్రేమిస్తుంటాడు. ఇటు కొడుకూ అదే పనిలో ఉంటాడు. మరి వీరి ప్రేమకథలు ఏ తీరాలు చేరాయో అనేదే సినిమా అనేలా ఉంది ట్రైలర్. దీనికి ఎవ్వరూ ఊహించిన ఓ సమస్య వచ్చిందనే డైలాగ్ కూడా ఉంది. అంటే రెగ్యులర్ గా విలన్ అన్నమాట. ఇక డైలాగ్స్ చూస్తే కొన్నాళ్ల క్రితం ఎలాంటి డైలాగ్స్ తో విసిగిస్తున్నాడు అని అల్లరి నరేష్ ను పక్కన పెట్టారో.. ప్రాససలు, పంచ్ లు అంటూ అర్థం లేని మాటలతో ఊదరగొట్టిన కొందరు రచయితలను ఎలా సైడ్ చేశారో.. అవన్నీ ఈ ట్రైలర్ లోనే కనిపిస్తున్నాయి. నవ్వించడానికి డైలాగ్స్ రాయడం కాదు.. సిట్యుయేషన్ లో నుంచి డైలాగ్స్ వస్తే నవ్వు వస్తుంది. లేదంటే ఇలా మజాకా ట్రైలర్ లా అతి మామూలుగా కనిపిస్తుంది.
మామూలుగా ఏ ట్రైలర్ అయినా సినిమాలపై అంచనాలు పెంచుతుంది. బట్ మజాకా ట్రైలర్ లో అలాంటి అంచనాలు పెంచే అంశాలేం కనిపించడ లేదు. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా ఏమంత గొప్పగా లేవు. మళయాలంలో బ్లాక్ బస్టర్ అయిన 'బ్రో డాడీ' మూవీ నుంచి ఇన్స్ స్పైర్ అయ్యారా లేక.. కాపీ రైట్స్ తీసుకున్నారా అనేది తెలియదు కానీ.. చాలా వరకూ ఇది ఆ మూవీనే అంటున్నారు.
కొన్నిసార్లు ఈ తరహార రొటీన్ కామెడీ కూడా వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదే త్రినాథరావు చివరి సినిమా ధమాకా కూడా అలా బ్లాక్ బస్టర్ అయింది. అలాంటి లక్ ఫ్యాక్టర్ ఏదైనా కలిసొస్తే మజాకా కూడా ధమాకాలా పేలుతుంది. లేదంటే తీసిన వారికి మజా లేకుండా పోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com