Cinema: ‘వచ్చినవాడు గౌతమ్’ పోస్టర్ రిలీజ్

Cinema: ‘వచ్చినవాడు గౌతమ్’ పోస్టర్ రిలీజ్
X
మెడికో థ్రిల్లర్ గా రాబోతున్న అశ్విన్ బాబు

ఇటీవలే ‘హిడింభ’ సినిమాలో కనిపించిన హీరో అశ్విన్ బాబు.. ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’ కోసం సిద్ధమవుతున్నాడు. దర్శకుడు మామిడాల ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షణ్ముఖ పిక్చర్స్‌ పతాకంపై ఆలూరి సురేష్‌ నిర్మించనున్నారు. మెడికల్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ రివీల్ అయింది. అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ పోస్టర్‌లో కథానాయకుడి చేతిని స్టెతస్కోప్ పట్టుకున్నట్లు చిత్రీకరించారు. ఈ మూవీ కోసం అశ్విన్.. ఫిజికల్ గా చాలా ట్రాన్స్ఫర్మేషన్ కానున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు గౌర హరి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక 'రాజు గారి గది' సిరీస్ సినిమాలతో విజయాలు అందుకున్న హీరో అశ్విన్ బాబు. ఆయన హీరోగా నటించిన 'హిడింబ' జూలై 20న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి కథను ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే... ఆ కథను ఆసక్తిగా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. అశ్విన్ బాబు పడిన కష్టం తెరపై తెలుస్తుంది. పార్టులు పార్టులుగా బావుంటుంది. కానీ, ఓ కథగా, సినిమాగా చూసినప్పుడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. కాస్త డిజప్పాయింట్ అవుతాం. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ షాక్ ఇస్తుంది. క్లైమాక్స్ సీక్వెల్ ఉంటుందని హింట్ ఇస్తుంది.

నందితా శ్వేత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. కాగా ఈ సినిమాకు అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి ప్రారంభంలో రిలీజైన మూవీ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా.. ఫుల్ మూవీ మాత్రం ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించలేకపోయింది. దీంతో అశ్విన్ ఫ్యాన్స్ మరోసారి నిరాశకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారీ అంచనాలు పెట్టుకున్న ‘హిడింభ’బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో.. ఇప్పుడు అశ్విన్ తన రాబోవు మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. డీఎస్సార్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు ఎంఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Tags

Next Story