Nayanthara : నయనతారకు సపోర్ట్ గా మీనా, ఖుష్బూ, రెజీనా..

లేడీ సూపర్ స్టార్ అని ఇకపై నన్ను పిలవొద్దు అంటూ రీసెంట్ గా మీడియాకు, ఫ్యాన్స్ కు, ఇండస్ట్రీకి రిక్వెస్ట్ పెడుతూ ఓ లేఖ విడుదల చేసింది నయనతార. ఆ బిరుదు ఆమెకు వచ్చిన విజయాలు, ఎంచుకున్న కథలను బట్టే వచ్చింది కానీ.. ఎవరో సరదాగా చెప్పింది కాదు. అయినా వద్దు అన్నది అంటే ఆమె కారణాలు ఆమెకు ఉంటాయి. ఇక లేటెస్ట్ గా నయన్ మరో లేడీ ఓరియంటెడ్ కథకు ఓకే చెప్పింది. అది కూడా తను 2020 లో చేసిన ‘మూకుత్తి అమ్మన్’అనే చిత్రానికి సీక్వెల్ గా వస్తోంది. ఈ చిత్రం తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్ అయింది. ఈ పార్ట్ ను ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేశాడు. ఈ సీక్వెల్ కు మాత్రం సుందర్ సి దర్శకుడు.
తాజాగా మూకుత్తి అమ్మన్ మూవీ ఓపెనింగ్ జరిగింది. ఈ ఓపెనింగ్ సెరెమనీకి వెటరన్ బ్యూటీ మీనాతో పాటు రెజీనా కసాండ్రా కూడా రావడం విశేషం. ఇదే వేడుకకు సుందర్ వైఫ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ కూడా ఉంది. ఖుష్బూ, మీనా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఆ కారణంగా కూడా ఈ ఓపెనింగ్ కు వచ్చారు అనుకుంటున్నా.. నిజానికి ఈ మూవీలో మీనా కూడా ఓ పాత్ర చేస్తోందనే టాకూ లేకపోలేదు. అలాగే రెజీనా కూడా.
ఇక ఈ కథను ప్యాన్ ఇండియా స్థాయిలో చెప్పబోతున్నాడట సుందర్ సి. అరణ్మనై అనే హారర్ సిరీస్ తో నాలుగు సార్లూ విజయాలు అందుకున్నాడు సుందర్. ఈ సారి అమ్మోరు తల్లి కథతో వస్తున్నాడు. మరి ఈ కథతో కేవలం భక్తి మాత్రమే చెబుతాడా.. లేక ఫస్ట్ పార్ట్ లాగా సొసైటీ తీరుపై సెటైర్స్ ఉంటాయా లేక.. సుందర్ స్టైల్లో అమ్మోరు తల్లి వర్సెస్ హారర్ భూతాలూ ఉంటాయా అనేది చూడాలి. అన్నట్టు ఈ కథను కేవలం 30 రోజుల్లోనే రెడీ చేశాడట సుందర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com