Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి వెడ్స్ సుశాంత్.. అసలు మేటర్ ఏంటంటే..?

కొన్ని రూమర్స్ ఎలా వస్తాయో కానీ.. చూడగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. తర్వాత నిజమేనా అనే డౌట్ వస్తుంది. బట్ సిట్యుయేషన్స్ ను బట్టి.. కొన్నిసార్లు నమ్మే విధంగా కూడా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోన్న టాలెంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరిని.. సుశాంత్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది కొత్త రూమర్. విశేషం ఏంటంటే.. మీనాక్షి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది సుశాంత్ సరసనే. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే మూవీతోనే అమ్మడి తెరంగేట్రం జరిగింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే త్రివిక్రమ్ ఈ పాపను తెగ పొగిడేసి తనే ఆఫర్ ఇస్తా అన్నాడు.. గుంటూరు కారంలో ఆమ్లెట్స్ వేసే వేషం ఇచ్చాడు కూడా. ఆ తర్వాత మెల్లగా తనదైన రూట్ లో దూసుకువస్తోంది భామ.
అయితే రీసెంట్ గా కిరణ్ అబ్బవరం తన ఫస్ట్ మూవీ హీరోయిన్ రహస్య గోరక్ ను అందరికీ తెలిసేలానే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అందుకే సుశాంత్ కూడా అలాగే చేస్తున్నాడేమో అనుకున్నారు. బట్ ఇది కంప్లీట్ గా ఫాల్స్ న్యూస్. ‘సుశాంత్ వెడ్స్ మీనాక్షి’ అనే బోర్డ్ ఫ్యూచర్ లో ఏదైనా సినిమాల్లో కనిపించే అవకాశం ఉందేమో కానీ.. నిజంగా అయితే నిజం కాదు.. అని తేల్చారు. అదీ మేటర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com