Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం నుంచి మరో మెలోడియస్ సాంగ్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. అనిల్, వెంకీ కాంబోలో ఆల్రెడీ ఎఫ్2, ఎఫ్ 3 చిత్రాలు వచ్చాయి. రెండూ పెద్ద విజయం సాధించాయి. ఈ మూవీతో అంతకు మించిన విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారు అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పటి వరకూ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అంతా అదిరిపోయింది అనే టాక్ నే తెచ్చుకుంది. ఇంతకు ముందు రమణ గోగులతో పాడించిన గోదారి గట్టుపైనా సందమామవే పాట ప్రస్తుతం యూ ట్యూబ్ ను ఊపేస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతానికి చాలామంది ఫిదా అయిపోతున్నారు. ఎక్కడ చూసిన ఆ పాట రీల్సే కనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాట విడుదల చేశారు.
మామూలుగా ఫస్ట్ సాంగ్స్ బ్లాక బస్టర్ సాంగ్ వస్తే నెక్ట్స్ సాంగ్ ఆ రేంజ్ లో ఉండదు. బట్ ఈ పాట కూడా ఓ రేంజ్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ పాటతో పెద్ద కథను సింపుల్ గా చెప్పేశాడు అనిల్ రావిపూడి. తన ప్రేమకథను భార్యకే చెప్పే హీరో.. ఆ కథలో ఉన్న అమ్మాయి పక్కనే ఉండటం.. ఈ విషయం భార్యకు తెలియకపోవడం.. ఏ మాత్రం ఓవర్ కాకుండా సాహిత్యం బ్యాలన్స్ డ్ గా ఉండటం ఇంకా బావుంది. ఈ పాటతో పెద్ద పోలీస్ అయిన హీరో కొత్తగా డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయిన ఆడ పోలీస్ లకు ట్రెయినింగ్ ఇవ్వడం.. అందులో భాగంగా ట్రెయినింగ్ కు వచ్చిన ‘మీనా’అనే అమ్మాయితో ప్రేమలో పడటం.. ప్రేమలో ఉన్నప్పుడు ఉండే అన్ని సరదాలూ అనుభూతి చెందినా.. చివరికి మరదలిని పెళ్లి చేసుకోవాల్సి రావడం.. ఇలా సాగుతుందీ పాట. ఓ రకంకా ఇదే సిట్యుయేషన్ లో చాలా పాథటిక్ సాంగ్స్ వచ్చాయి. కానీ అనిల్ రావిపూడి కదా.. సింపుల్ గా, బ్యూటీఫుల్ గా మార్చాడీ సన్నివేశాన్ని. అది అర్థం చేసుకునే అనంత శ్రీరామ్ సాహిత్యం, భీమ్స్ మ్యూజిక్ ఉన్నాయి.
మొత్తంగా ధమాకా తర్వాత భీమ్స్ సిసిరోలియో మరోసారి బెస్ట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నాడు అనిపిస్తోందీ రెండు పాటలకే. మరి మిగతా పాటలు ఎలా ఉంటాయో కానీ.. ఈ రెండు పాటలతో సినిమాపై కంప్లీట్ గా ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com