Meera Jasmine : మీరా జాస్మిన్‌‌ కి బోయపాటి బంపరాఫర్..!

Meera Jasmine :   మీరా జాస్మిన్‌‌ కి బోయపాటి బంపరాఫర్..!
Meera Jasmine : అఖండ మూవీతో సక్సెస్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. తన తదుపరి చిత్రాన్ని యంగ్ హీరో రామ్ పోతినేనితో చేస్తున్నాడు.

Meera Jasmine : అఖండ మూవీతో సక్సెస్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. తన తదుపరి చిత్రాన్ని యంగ్ హీరో రామ్ పోతినేనితో చేస్తున్నాడు. ఇప్పటికే కథాచర్చలు కంప్లీట్ అవ్వగా, ప్రస్తుతం నటీనటులు ఎంపిక నడుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.


అదేంటంటే ఈ సినిమాలో హీరో రామ్‌‌కి అక్కయ్యగా ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్‌‌ని తీసుకున్నారన్న ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఆమెకి బోయపాటి కధ,పాత్రను వివరించగా చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో అమెది కీలకమైన పాత్ర అని సమాచారం. కాగా బోయపాటి తెరకెక్కించిన మొదటి సినిమా భద్రలో మీరా జాస్మిన్ హీరోయిన్‌‌గా నటించిన సంగతి తెలిసిందే.


పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన మీరా జాస్మిన్ ఇప్పుడు తెలుగులో రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ కొత్త కొత్త ఫోటోలతో అదరగొడుతోంది. ఈ క్రమంలో మంచి సక్సెస్ లో ఉన్న బోయపాటి నుంచి ఆఫర్ రావడంతో ఓకే చెప్పిందట మీరా జాస్మిన్.. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్సు త్వరలోనే వెలువడనుంది.


ఇక అఖండ సినిమాని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అటు రామ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్‌లో వారియర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్, బోయపాటి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Tags

Read MoreRead Less
Next Story