చెత్త డబ్బా దగ్గర దొరికిన ఈ చిన్నారి మిథున్ చక్రవర్తి కూతురు..

చెత్త డబ్బా దగ్గర దొరికిన ఈ చిన్నారి మిథున్ చక్రవర్తి కూతురు..
మిథున్ చక్రవర్తి మరియు అతని రెండవ భార్య యోగితా బాలి కలిసి దత్తత కార్యక్రమాలను పూర్తి చేసి బిడ్డను ఇంటికి తీసుకువెళ్లారు.

మిథున్ చక్రవర్తి మరియు అతని రెండవ భార్య యోగితా బాలి కలిసి దత్తత కార్యక్రమాలను పూర్తి చేసి బిడ్డను ఇంటికి తీసుకువెళ్లారు.

బాలీవుడ్ 'డిస్కో కింగ్' మిథున్ చక్రవర్తి తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి డ్యాన్స్, నటన నైపుణ్యాలతో సినీ ప్రియుల హృదయాలను గెలుచుకున్నాడు. చిత్ర పరిశ్రమలో రాణించడమే కాకుండా, మిథున్ చక్రవర్తి తన నిజ జీవితంలో కూడా 'సూపర్ హీరో'. ఈ నటుడికి ముగ్గురు కుమారులు.. మహాక్షయ్, నమషి, ఉష్మే, దిశానీ చక్రవర్తి అనే అద్భుతమైన, చురుకైన కుమార్తె కూడా ఉన్నారు.

మిథున్ చక్రవర్తి పెద్ద కుమారుడు మహాక్షయ్ గురించి అందరికీ తెలుసు. అతడు కూడా నటుడే. బుల్లితెర సీరియల్ 'అనుపమ' నటి మదాలస శర్మ భర్త. అయితే, మిథున్ దత్తపుత్రిక దిషానీ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.

మిథున్‌ ఓ రోజూ టీ తాగుతూ పేపర్‌లో కనిపించిన ఆర్టికల్ చదువుతున్నారు. అందులో ఓ చిన్నారి ఏడుస్తూ చెత్త డబ్బా దగ్గర కనిపించింది. ఆ పాపని గమనించి ఒకరు ఇంటికి తీసుకెళ్లారు అని ఉంది. అది చదవగానే ఆ పాపని తాను తీసుకోవాలనుకున్నాడు మిథున్. పాపకు, తనకూ ఏదో తెలియని అనుబంధం ఉందనిపించింది.. అంతే భార్య యోగితా బాలితో మాట్లాడి ఆ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తరువాత గవర్నమెంట్ రూల్ ప్రకారం దత్తత కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు మిధున్ దంపతులు.

ప్రస్తుతం, దిశానీ చక్రవర్తి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి యాక్టింగ్ కోర్సును అభ్యసిస్తున్నారు. సోదరుడు ఉష్మే చక్రవర్తి దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ "హోలీ స్మోక్" తో దిశానీ ఇప్పటికే నటిగా రంగ ప్రవేశం చేసింది. దిశ "అండర్ పాస్" "సబ్టిల్ ఏషియన్ డేటింగ్ విత్ పిబిఎమ్" వంటి లఘు చిత్రాలలో కూడా కనిపించింది.

Tags

Read MoreRead Less
Next Story