Brahmanandam : భారతదేశంలోనే అత్యంత సంపన్న హాస్యనటుడు

ఏదైనా బాధలో ఉన్నప్పుడు హాస్యనటులు తమకు ఉత్తమ వైద్యం చేస్తారు. ఆందోళనలను మరచిపోవడానికి ప్రజలకు సహాయం చేయడం వారి విధి అనేలా ప్రవర్తిస్తుంటారు. నటుల వలె, అనేక మంది హాస్యనటులు కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉంటారు. జనాదరణతో పాటు, వారు టీవీ షోలు, సినిమాలు, లైవ్ ఈవెంట్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో పని చేయడం ద్వారా గొప్ప సంపదను కూడా సంపాదిస్తూ ఉంటారు.
ఇక భారతదేశంలోనే అత్యంత సంపన్న హాస్యనటుడి గురించి విషయానికొస్తే.. అందులో కపిల్ శర్మ లేదా జానీ లివర్ లేదంటే భారతీ సింగ్ ఉంటారని అస్సలు అనుకోవద్దు. అవును, రూ. 490 కోట్ల నికర విలువ కలిగిన అత్యంత ధనిక హాస్యనటుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తాజా నివేదికల ప్రకారం, భారతదేశంలో అత్యంత సంపన్న హాస్యనటుడు దక్షిణ భారతదేశానికి చెందినవాడు. అవును, పలు నివేదికలు ప్రచురించబడిన పేరు 'బ్రహ్మానందం'. నటుడు-హాస్యనటుడు అతని తరానికి చెందిన చాలా సౌత్ సినిమాల్లో కనిపించాడు. రూ. 490 కోట్ల నికర విలువతో అత్యంత ధనిక హాస్యనటుడుగా పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు ఆయన రూ. 2 కోట్లకు పైగా తన నెల జీతం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఓ రిపోర్ట్స్ ప్రకారం, బ్రహ్మానందం ఒక్కో సినిమాకి 1 నుండి 2 కోట్ల రూపాయల వరకు, వాణిజ్య ప్రకటనలకు దాదాపు కోటి వరకు వసూలు చేస్తారు. అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హాస్యనటుడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. 67 ఏళ్ల తెలుగు హాస్యనటుడు-బ్రహ్మానందం ఇప్పటి వరకు 1000 కంటే ఎక్కువ చిత్రాలలో కనిపించినందున అత్యధిక సినిమా క్రెడిట్‌లకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కూడా నెలకొల్పాడు. అయన ఆరు రాష్ట్ర నంది అవార్డులు, సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు లాంటి వివిధ సినిమా అవార్డులను కూడా గెలుచుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com