Mega 157 : పంచభూతాల కలయికతో పోస్టర్ రిలీజ్.. కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో చిరు బ్యాక్

మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వదిలిన ఈ పోస్టులో చిరంజీవి కొత్త సినిమాను 'మెగా 157(మెగా 157)'గా పరిచయం చేసిన సంస్థ.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ లో మసకబారిన గుహ.. అందులో ఓ పక్కన తేలు కనిపిస్తోంది. విశ్వంలోని ఐదు ఎలిమెంట్స్ మెగా స్టార్ అనే ఎలిమెంటల్ ఫోర్స్ కోసం ఏకమవుతాయి అంటూ ఈ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. దాంతో పాటు ఇందులో శ్రీ చక్రం వలె విశ్వంలోని పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం అనే ఐదింటికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించారు. దీన్ని బట్టి చూస్తుంటే మెగాస్టార్ ఈ సారి కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నట్టు తెలుస్తోంది. సైన్స్ అండ్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని పోస్టర్ ను చూస్తేనే అర్థమవుతోంది.
ఇక నందమూరి కళ్యాణ్ 2022లో నటించిన 'బింబిసార'తో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ మల్లిడి వశిష్ట చిరంజీవి 157వ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వశిష్ట 'బింబిసార' సీక్వెల్ తో వస్తాడని అందరూ భావిస్తుండగా.. ఈ సమయంలో మెగాస్టార్ మూవీతో వచ్చి అందర్నీ ఆశ్చర్యపర్చాడు.
చిరంజీవి తన 156వ సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించాడు. దీన్ని తన కుమార్తె సుస్మిత నిర్మించనుందని, ఆ సినిమా కంటే ముందు రిఫ్రెషింగ్ కోసం తన భార్య సురేఖతో అమెరికా పయనమవుతున్నట్టు అప్పట్లో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇక ఆయన ఇటీవల నటించిన భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజైన అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పర్చింది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకక్వం వహించగా.. ఇందులో తమన్నా హీరోయిన్, కీర్తి సురేష్ చిరుకి చెల్లెలిగా కనిపించింది. ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందగా.. రూ.50కోట్లతో ఈ హక్కులను కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మూవీ సెప్టెంబర్ లో ఓటీటీలో స్ర్టీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.
#Mega157 🔮
— UV Creations (@UV_Creations) August 22, 2023
This time, its MEGA MASS BEYOND UNIVERSE ♾️
The five elements will unite for the ELEMENTAL FORCE called MEGASTAR ❤️🔥
Happy Birthday to MEGASTAR @KChiruTweets Garu ❤️@DirVassishta @UV_Creations#HBDMegastarChiranjeevi pic.twitter.com/llJcU6naqX
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com