Viswambhara GLIMPSE : విశ్వంభర గ్లింప్స్.. ఈ సారి అదుర్స్ అంతే

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ఒక రోజు ముందుగానే విశ్వంభర నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. వశిష్ట డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2026 సమ్మర్ లో విడుదల చేయబోతున్నాం అని ఆల్రెడీ చిరంజీవి ఒక వీడియో ద్వారా చెప్పేశాడు. ఇక గ్లింప్స్ విషయానికి వస్తే ఏ విమర్శల వల్ల సినిమా ఆగిపోయిందో.. ఆ విమర్శలకు సమాధానం చెప్పబోతున్నాం అనే క్లారిటీ ఇవ్వడానికే ఈ గ్లింప్స్ రిలీజ్ చేసినట్టు కనిపిస్తోంది. యస్.. ఈ సారి గ్లింప్స్ లో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఈ గ్లింప్స్ చూశాక విశ్వంభర తో ఓ విజువల్ వండర్ చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగింది. ఏ విఎఫ్ఎక్స్ వల్ల ఈ మూవీ ట్రోల్ అయిందో.. ఆ ట్రోల్స్ కు సమాధానంగా కనిపిస్తోందీ గ్లింప్స్. అందుకే విజువల్స్ ను చూపించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. చిరంజీవి షాట్స్ చివర్లో మాత్రమే కనిపించాయి. అది కూడా ఫుల్ బాడీ తక్కువగా కనిపిస్తుంది.
గ్లింప్స్ చూస్తే.. ఈ విశ్వంభరలో అసలేం జరిగిందో ఈ రోజైనా చెబుతావా మురా అని ఓ పాప ఓ వ్యక్తిని అడుగుతుంది. దానికి అతను.. ‘ ఒక సంహారం.. దాని తాలూకూ యుద్ధం, ఒకడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది.. అంతకు మించిన మరణశాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతికి ఉన్న ఓ సమూహం తాలూకూ నమ్మకం.. అలసిపోని ఆశయానికి ఊపిరిపోసేవాడొకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురుచూసింది..’అంటూ ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుండగా.. అందుకు తగ్గ విజువల్స్ తో గ్లింప్స్ సాగుతుంది.
మొత్తంగా విఎఫ్ఎక్స్ ఈ సారి బెస్ట్ గా చేస్తున్నాం.. బొమ్మ అదుర్స్ అనిపిస్తాం అనే గ్యారెంటీని ఫ్యాన్స్ కు ప్రామిస్ చేసినట్టుగా ఉంది ఈ మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com