చిరంజీవి, శ్రీదేవి ఇప్పుడూ మ్యాజిక్ చేస్తారా

మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి కెరీర్ లో టాప్ ఫైవ్ మూవీస్ లో ఖచ్చితంగా ఉండే సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. కే రాఘవేంద్రరావు సృష్టించిన ఈ మ్యాజిక్ కు ఆనాటి తెలుగు ప్రేక్షకులు మైమరచిపోయారు. 1990 మే 9న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. సినిమా రిలీజ్ టైమ్ లో అకాల వర్షాలతో ఆంధ్ర రాష్ట్రమంతటా విపరీతమైన తుఫాన్ లు వచ్చినా ఈ మూవీకి కలెక్షన్ల తుఫాన్ ఆగలేదు. థియేటర్స్ లోకి నీళ్లు వచ్చినా అలాగే చూశారు జనం. రాజుగా చిరంజీవి, ఇంద్రజగా శ్రీదేవి జంట కన్నుల పంటగా కనిపిస్తుంది. అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి వంటి ఆనాటి టాప్ విలన్స్ ఈ మూవీకి మరో ఎసెట్. ఇక ఇళయరాజా మ్యూజిక్ ఎవర్ గ్రీన్ అనడంలో సందేహం ఏముందీ..?
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ విడుదల చేయబోతున్నారు. అది కూడా 2డి తో పాటు 3 డి ఫార్మాట్ లో కూడా. నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా క్వాలిటీ పెంచి అప్పుడు రిలీజ్ అయిన టైమ్ కే రీ రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు అతిలోక సుందరి అమరపురికి వెళ్లిపోయింది. జగదేకవీరుడు మాత్రం ఉన్నాడు. మరి అప్పటి లాగానే ఈ మూవీ ఇప్పుడు కూడా రికార్డ్ స్థాయి విజయం సాధిస్తుందా..? చిరంజీవి, శ్రీదేవి మ్యాజిక్ రీ క్రియేట్ అవుతుందా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com