Mahesh Babu : చిరు, పవన్ సినిమాలకు మహేష్ వాయిస్ ఓవర్.. కానీ ఇక్కడో ఇంకో విషయం గమనించారా?

Mahesh Babu : మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన మూవీ ఆచార్య.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రామ్ చరణ్ సిద్దా అనే ఓ కీరోల్ ప్లే చేశాడు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నారు.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.
కాగా ఈ సినిమాకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని చిరంజీవినే స్వయంగా వెల్లడించారు. మహేష్... మెగా హీరోల సినిమాలకి వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్తేమి కాదు.. గతంలో చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి కూడా మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.. ఇప్పుడు ఆచార్యకి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంది.
అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలలో మెగా బ్రదర్స్ ఇద్దరూ నక్సలైట్ పాత్రలో కనిపించడం. ఇప్పటివరకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన జల్సా, బాద్షా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆచార్య ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com