Chiranjeevi : విశ్వంభర సాంగ్.. రాములోరి గొప్ప చెప్పుకుందామా

Chiranjeevi :  విశ్వంభర సాంగ్.. రాములోరి గొప్ప చెప్పుకుందామా
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా విశ్వంభర నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఈ గీతాన్ని శంకర్ మహదేవన్, ఐరా ఉడుపి, లిప్సిక భాష్యం పాడారు. రామజోగయ్య శాస్త్రి రాశాడు. రీసెంట్ గా వచ్చిన ప్రోమో చూస్తేనే ఇది రాములోరి పై వచ్చే పాట అని అర్థం అయింది.

రామయ్యపైన పాట అంటే ఏ సినిమా అయినా సాహిత్యం ఉప్పొంగి తీరుతుంది. రామజోగయ్య శాస్త్రి కూడా అదే చేశాడు. రాశాడు. ‘హే తయ్యతక్క తక్కధిమి చెక్కా భజనాలాడి రాములోరి గొప్ప చెప్పుకుందామా.. ఆ సాములోరి పక్కనున్న సీతామాలచ్చుమమ్మ లక్షణాలు ముచ్చటించుకుందామా.. నీ గొంతు కలిపి మా వంత పాడగా రావయ్య అంజని హనుమా..’ అంటూ మొదలైన ఈ పాటలో రామయ్య గొప్పదనాలను కీర్తిస్తూ, చెడుపై ఆయన చేసిన యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ అద్భుతంగా సాగుతుంది. అలాగే వంత పాడేందుకు హనుమయ్యను కూడా పిలవడం ఓ విశేషంగా కనిపిస్తుంది. ‘శివుని ధనువు వంచినోడు, రావణ మదము తెంచినోడు, దర్మము విలువ పెంచినోడు ..’ అంటూ సాగే చరణం సైతం ఆకట్టుకునేలా ఉంది.

ఇక ఈ పాట కోసం వేసిన సెట్స్ అద్భుతంగా ఉన్నాయి. కలర్ టోన్ అదిరిపోయింది. డ్యాన్సులు కూడా హెవీగా లేకుండా భక్తిభావం కనిపించేలా లైట్ గా సాగాయి. ఇక పాట ఆద్యంతం తన ట్యూనింగ్ తో మెస్మరైజ్ చేశాడు కీరవాణి. మొత్తంగా విశ్వంభర ఫస్ట్ సాంగ్ బెస్ట్ ఇంపాక్ట్ వేస్తుందనే చెప్పాలి.

Tags

Next Story