Chiranjeevi : లండన్ లో మెగా ఫ్యామిలీ వెకేషన్

Chiranjeevi  : లండన్ లో మెగా ఫ్యామిలీ వెకేషన్
X

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో కలిసి లండన్ లో విహారయాత్ర చేస్తున్నాడు. అయితే ఈ వెకేషన్ లో ఆయనతో పాటు రామ్ చరణ్ దంపతులు, మనవరాలు కూడా ఉంది. తాజాగా లండన్ లోని హైడ్ పార్క్ లో నలుగులూ కలిసి వాకింగ్ చేస్తోన్న ఫోటో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది. అయితే ఇది రిలాక్సేషన్ కోసం వెళ్లిన వెకేషన్ కాదు. మెగాస్టార్ కు లండన్ లో ప్రారంభం కాబోతోన్న ఒలింపిక్స్ ఇనాగరల్ ఈవెంట్ కు ఇన్విటేషన్ వచ్చింది. అందుకోసమే అక్కడికి వెళ్లాడు. పనిలో పనిగా కొడుకు కోడలు, మనవరాలిని తీసుకువెళ్లాడు. అయితే ఈ ఫోటోలో మనవరాలి ఫేస్ ను మరోసారి కవర్ చేసే ప్రయత్నం చేశారు.

ఇక సినిమాల పరంగా చిరు ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో ఉన్నాడు. ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తయింది. రెండు పాటలతో పాటు క్లైమాక్స్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆగస్ట్ 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేసే అవకాశాలున్నాయంటున్నారు.

ఇటు రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సినిమాకు సిద్ధం అవుతున్నాడు. గేమ్ ఛేంజర్ కు సంబంధంచి ఆయన పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో.. కాస్త గ్యాప్ ఉంది. అందుకే ఈ వినోద యాత్ర అన్నమాట.

Tags

Next Story