Ram Charan : గేర్ మార్చని గేమ్ ఛేంజర్

Ram Charan :  గేర్ మార్చని గేమ్ ఛేంజర్
X

రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ డిసెంబర నుంచి సంక్రాంతి బరిలోకి వెళ్లింది. ఈ మార్పు డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ సందర్భంగా రావాలనుకున్న సినిమాలకు పెద్ద ప్లస్ అయింది. అయితే గేమ్ ఛేంజర్ పై అంచనాలు పెంచే ప్రయత్నం ఇప్పటి వరకూ చేయలేదు టీమ్. కేవలం రెండు పాటలు మాత్రమే వచ్చాయి. రెండో పాటలోని డ్యాన్స్ స్టెప్పులనే రీల్స్ గా చేసిన వారినే ప్రమోషన్ అస్త్రాలుగా వాడుతున్నారు. జపాన్ వాళ్లు రీల్ చేశారనీ.. మరో దేశం వాళ్లు రీల్స్ చేశారనీ.. ఇదే మా హీరో స్టామినా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చరుచుకోవడమే తప్ప అసలు ఇప్పటి వరకూ సినిమాపై అంచనాలు పెంచే మేటర్ ఏం లేదు అనేది నిజం. ఉన్న మాటంటే ఫ్యాన్స్ కు కోపం వస్తుందేమో కానీ.. అసలు గేమ్ ఛేంజర్ పై ఇప్పటి వరకు అసలు అంచనాలు క్రియేట్ అయ్యాయా.. అయ్యేందుకు మూవీ టీమ్ నుంచి చేసిన ఒక్కటంటే ఒక్కటైనా ప్రమోషనల్ కంటెంట్ ఉందా..? అంటే లేదనే సమాధానమే వస్తుంది.

అయితే సంక్రాంతికి ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి.. అప్పుడే ఎందుకు అనుకున్నారేమో అనే ఆన్సర్ కూడా రెడీగా ఉంటుంది. బట్ అసలే గ్లోబల్ స్టార్ అని చెబుతున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్స్ చాలా ముందు నుంచే ప్రారంభం కావాలి. ఇలాంటి సినిమాలు నిత్యం జనాల్లో ఉంటేనే ఓపెనింగ్ డే కలెక్షన్స్ అయినా.. భారీ కలెక్షన్ల పోస్టర్స్ అయినా సాధ్యం అనేది అందరికీ తెలుసు. అయితే ఇదంతా వారికి తెలియదా అంటే తెలుసు. కాకపోతే.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నిత్యం ఇతర హీరోలను అబ్యూజ్ చేస్తూ.. అదే పనిగా గేమ్ ఛేంజర్ ను లేపుతున్నారు. బట్ లేపేంత మేటర్ ఇప్పటి వరకూ వాళ్లు రిలీజ్ చేయలేదు. ఓ మంచి టీజర్ వస్తే.. అప్పుడు అదిరిపోయేలా ప్రమోట్ చేసుకోవచ్చు. కేవలం పాటలు, రీల్స్ కే ఓ ఇదైపోతే అసలు కంటెంట్ వచ్చే టైమ్ కు అలిసిపోతారేమో. ఏదేమైనా గేమ్ ఛేంజర్ ఇప్పటి వరకూ అసలు గేర్ వేయలేదు. ఈ పాటలతో పైసలు రాలవు. అందుకే దీపావళికి అయినా ఓ మంచి టీజరో లేక కనీసం గ్లింప్స్ అయినా రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీలవుతారు.

Tags

Next Story