Chiranjeevi : మాస్ తర్వాత క్లాస్.. చిరంజీవి ప్లాన్ అదిరింది

మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోవాలని ప్రయత్నించాడు. బట్ విశ్వంభర కాస్త బ్రేకులు వేసింది. ఈ మూవీ ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని వాయిదా వేశారు. ప్రస్తుతం ఓ సీనియర్ దర్శకుడి పర్యవేక్షణలో కొత్త విఎఫ్ఎక్స్ టీమ్ తో కలిసి వర్క్ చేస్తున్నారు. ఇక తన లైనప్ ను మరింత పెంచుకునే పనిలో మెగాస్టార్ తీసుకున్న డెసిషన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది.
రీసెంట్ గా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీకి ఓకే చెప్పాడు చిరంజీవి. ఈ మూవీ అనౌన్స్ మెంట్ టైమ్ లోనే రక్తాలతో తడిచిన చేతులతో కనిపించారు. అంటే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా అనిల్ రావిపూడికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనిల్ సినిమా అంటే మంచి వినోదం గ్యారెంటీ. అదే టైమ్ లో మాస్ ను మెప్పించే అంశాలు కూడా ఉంటాయి. అలాగని అనిల్ సినిమా అంటే మాస్ అని ఖచ్చితంగా చెప్పలేం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందని మాత్రం అనుకోవచ్చు.
అలా శ్రీకాంత్ ఓదెలతో మాస్, అనిల్ రావిపూడితో క్లాస్ మూవీస్ కు కమిట్ అయిన మెగాస్టార్ తన లైనప్ లో వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ఆ వైవిధ్యం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే చెప్పాలి. నిజానికి స్టార్ హీరోలు ఇలాంటి వేరియేషన్స్ చూపిస్తే వారికి కూడా కొంత ఫ్రెష్ గా ఉంటుంది. చూసేవారికీ కొత్తగా కనిపిస్తుంది. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్ లు పట్టాలెక్కబోతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com