Chiranjeevi: మెగాస్టార్ ట్వీట్.. తగ్గేదేలే అంటున్న బన్నీ ఫ్యాన్స్..

Chiranjeevi: మెగాస్టార్ ట్వీట్.. తగ్గేదేలే అంటున్న బన్నీ ఫ్యాన్స్..
Chiranjeevi: పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని మామయ్య చిరంజీవి బన్నీకి అదిరిపోయే ట్వీట్ ఇచ్చారు.

Chiranjeevi: మేగాస్టార్ మేనల్లుడు.. మామకు ఏమాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్. స్టైలిష్ కి ఐకాన్.. స్టెప్పులకు, బన్నీ ఈజీ యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ పుట్టిన రోజును పురస్కరించుకుని మామయ్య చిరంజీవి అల్లుడు అల్లు అర్జున్ కి అదిరిపోయే ట్వీట్ ఇచ్చారు.

పలువురు సినీ తారలు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చిరు చేసిన ట్వీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. హ్యాపీ బర్త్ డే బన్నీ.. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్ మార్క్ పుట్టిన రోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో అని చిరు ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ చూసి బన్నీ ఫ్యాన్స్ ఆనందంతో గాల్లో తేలిపోతున్నారు.. తమ అభిమాన నటుడి గురించి చిరంజీవి చెప్పిన మాటలు వారికి అత్యంత ఆనందాన్ని ఇచ్చాయి. దాంతో ఆ ట్వీట్ ని అందిరికీ షేర్ చేసే పనిలో పడ్డారు. లైక్స్, రీట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అలా కొన్ని క్షణాల్లోనే చిరంజీవి చేసిన ట్వీట్ 8800 మంది లైక్ చేయగా, సుమారు 2200 మంది రీట్వీట్ చేశారు.

Tags

Next Story