Sreeja: నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి.. : శ్రీజ

Sreeja: ఎవరెన్ని చెప్పినా మనకంటూ ఓ సొంత నిర్ణయం ఉంటుంది. దాని ప్రకారమే నడుచుకోవాలనుకుంటాము.. కానీ ఒక్కోసారి పరిస్థితులు అందుకు సహకరించవు.. ఒత్తిడి కావచ్చు, మరొకటి కావచ్చు పక్కవాళ్ల మీద ఆధారపడిపోతుంటాం.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ ఆలోచనాత్మక పోస్టులు పెడుతుంటుంది. ఒక్కోసారి అవి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఆమె పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ గడిచిన ఏడాది గురింది, తన జీవితంలో జరిగిన మార్పులు గురించి వివరించింది.
డియర్ 2022... నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.. కష్టసుఖాల్లో తోడున్నావు.. చాలా బాగా అర్థం చేసుకున్నావు.. అమితంగా ప్రేమించావు.. ఇలా నన్ను అన్ని విధాలుగా సంరక్షించే ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం మొదలైంది అని ఆమె రాసుకొచ్చారు. #Self connection, #innerpeace అనే ట్యాగ్‌లను జత చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com