బుల్లితెరపై మెగాస్టార్ నటించిన ఏకైక సీరియల్..

బుల్లితెరపై మెగాస్టార్ నటించిన ఏకైక సీరియల్..
కానీ బుల్లి తెరపై వచ్చే సిరియల్‌లో కనిపించారంటే.. అవునా, నిజమా.. ఇంతకీ ఏంటా సీరియల్ అని ఆసక్తి కనబరచకుండా ఉండలేరు చిరు అభిమానులు.

మెగాస్టార్ అభిమానులు ఆశ్చర్యపోయే సంఘటన. చిరంజీవి చిన్న తెర మీద కనిపించడం తెలుసు.. మీలో ఎవరు కోటీశ్వరుడుని ఒక సారి హోస్ట్ చేయడం, ఆ తరువాత బిగ్‌బాస్ ఫైనల్స్ అప్పుడు గెస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడం.. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ బుల్లి తెరపై వచ్చే సీరియల్‌లో కనిపించారంటే.. అవునా, నిజమా.. ఇంతకీ ఏంటా సీరియల్ అని ఆసక్తి కనబరచకుండా ఉండలేరు చిరు అభిమానులు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి విలన్‌గా విశ్వరూపాన్ని ప్రదర్శించి.. మెగాస్టార్‌గా ఎదిగిన తీరు అభిమానులకు ఎప్పుడూ మెస్మరైజింగ్‌గానే ఉంటుంది. తన సినీ కెరీర్‌లో దాదాపు అన్నీ హిట్లే.

సెలబ్రెటీల విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాల్లో నటిస్తూ సీరియల్స్‌లో రాణిస్తున్న నటీనటులను చాలా మందిని చూస్తున్నాం. కానీ చిరంజీవి కూడా ఒకప్పుడు బుల్లి తెర మీద కనిపించారనే విషయం ఎవరికీ అంతగా తెలియదు.

ఒకప్పుడు దూరదర్శన్‌లో ప్రసారమైన రజని అనే హిందీ సీరియల్‌లో మెగాస్టార్ మెరుపులా మెరిసారు. ధారావాహికంగా ప్రసారమైన ఈ సీరియల్‌లో ఒకే ఒక ఎపిసోడ్‌లో గెస్ట్‌గా వచ్చి అలరించారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు.. దాంతో సీరియల్స్‌కి దూరంగా ఉన్నారు. చిరు అప్పటికి ఇప్పటికి మెగాస్టార్. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తమ అభిమాన నటుడి పట్ల ఆనందం వ్యక్తం చేస్తుంటారు మెగా ఫ్యాన్స్.

Tags

Next Story