మీకు తెలుసా.. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్‌‌కు చిరంజీవి ప్రెసిడెంట్‌ అని..

మీకు తెలుసా.. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్‌‌కు చిరంజీవి ప్రెసిడెంట్‌ అని..
నటుడిగా రంగ ప్రవేశం చేయకముందు చిరంజీవి అభిమాన హీరో కృష్ణ అనే విషయం ఎవరికీ తెలియకపోవచ్చు.

మూడు తరాల వాళ్లకి కూడా గుర్తుండిపోయే స్టార్ హీరో మెగాస్టార్. చిరంజీవి స్టెప్పులతో సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యేది. ఆ స్టైలే వేరు. వెండి తెరపై చిరంజీవి ఏం చేసినా యువత అనుకరించడానికి ఆసక్తి చూపేవారు. ఇక ఇండస్ట్రీలో సైతం ఆయనకి పెద్ద అభిమాన గణమే ఉంది. నేటి యువ హీరోలంతా ఆయన సినిమాలు చూస్తూ పెరిగామని, చిరంజీవి సినిమా వస్తే మొదటి రోజు మొదటి ఆట చూడడానికి పరుగులు తీసేవారమని చెబుతుంటారు.

మరి ఆయనకి ఇంత మంది అభిమానులుంటే.. నటుడుగా రంగ ప్రవేశం చేయకముందు చిరంజీవి అభిమాన హీరో కృష్ణ అనే విషయం ఎవరికీ తెలియకపోవచ్చు. ప్రస్తుతం నెట్టింట్లో వీరిద్దరూ కలిసి దిగిన ఒకప్పటి ఫోటో వైరల్ అవుతోంది. దీంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘానికి చిరంజీవి ప్రెసిడెంట్‌గా ఉన్నారన్న విషయం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది.

దీనికి సంబంధించిన పాంప్లెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పాంప్లెట్‌లో చిరంజీవి పేరుతో పాటు కృష్ణతో చిరంజీవి కలిసి నటించిన తోడుదొంగలు సినిమా త్వరలో రాబోతోందనే విషయాన్ని కూడా తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story