Mega Victory Song : ఏంటి బాసూ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించిన మూవీ మన వీరశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జనవరి 12న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి చిరంజీవి, వెంకటేష్ యాక్ట్ చేసిన పాట విడుదల చేశారు. ఈ పాట మొత్తం మంచి జోష్ ఫుల్ గా ఉండేలా ఉంది. 31స్ట్ నైట్ నుంచి అందరికీ కనెక్ట్ అయిపోయేలా పాట ఉంది. మంచి ఎనర్జీ, ఇద్దరు హీరోల ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేలా సాహిత్యం కూడా కనిపించేలా ఉంది పాట.
‘మార్నింగ్ గ్రీన్ టీ, నైట్ అయితే నైంటీ.. ఎవడైతే ఏంటీ.. కుమ్మేద్దాం చంటీ..’అంటూ మెగాస్టార్ పాడితే.. ‘హే వెంకీ.. స్పీడ్ ఏమో ఫైజీ స్టైల్ జెన్ జీ.. వారెవా సర్ జీ.. హే బాసూ పెంచెయి బేస్’అంటూ వెంకీ పాడేయడం.. అదిరిపోయింది. అంతేనా ఏంటి బాసూ సంగతి.. అంటూ వెంకీ పాడితే.. అదిరిపోద్ది సంక్రాంతి అంటూ మెగాస్టార్ పాడటం మాత్రం కిరాక్ గా ఉంది. సింపుల్ గా పాట ఎలా ఉంది అనడం కంటే.. ఆ ఇద్దరూ కనిపించడం మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఇద్దరికీ సెట్ అయ్యేలా సాహిత్యం మాత్రం సెట్ కావడం ప్లస్ పాయింట్ అయింది. మంచి జోష్ ను నింపేసినట్టుగా ఉండేలా ఉంది పాట. సినిమాలో ఏమన్నా బిగ్గెస్ట్ ఎసెట్ అయ్యేలా కనిపించేలా ఉంది పాట కూడా.
కాసర్ల శ్యామ్ రాసిన పాటకు నకాష్ అజిజ్, విశాల్ దడ్లానీ పాడారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు. ఇక అనిల్ రావిపూడి నుంచి పాట అంటే మాటలు కాదు. మంచి క్యాచీ ట్యూన్ తో పాటు వినగానే ఆకట్టుకునేలా ఉండేలా ఉంది పాట. ఈ జనవరి 1స్ట్ న చిరంజీవి, వెంకటేష్ మాత్రం అదిరిపోయే గిఫ్ట్ అందించాడు అనిల్ రావిపూడి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

