Chiranjeevi_ Rajasekhar : చిరంజీవి ప్లేస్‌లో రాజశేఖర్...!

Chiranjeevi_ Rajasekhar : కోరనా, ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో టాలీవుడ్‌లో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఫిబ్రవరిలోనూ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సిన చిరంజీవి ఆచార్య, రవితేజ ఖిలాడీ చిత్రాలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలు ఏప్రిల్ లేదా మేలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పెద్ద సినిమాలు వాయిదా పడుతుండడంతో చిన్న సినిమాలు ధియేటర్‌లో రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ చిరంజీవి ఆచార్య వాయిదా పడితే ఆ ప్లేస్ లో రాజశేఖర్ నటిస్తోన్న శేఖర్ మూవీని రిలీజ్ చేయాలనీ మేకర్స్ ఆలోచిస్తున్నారట.
జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని వేరే నిర్మాతలతో కలిపి రాజశేఖర్ కూతుళ్లైన శివానీ, శివాత్మిక నిర్మిస్తున్నారు. సినిమా పైన మంచి అంచనాలున్నాయి. 2018లో మలయాళ బ్లాక్ బస్టర్ అయిన జోసెఫ్ అనే మూవీకి ఇది రీమేక్. వాస్తవానికి శేఖర్ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com