Acharya Movie : అచార్య సెన్సార్ రివ్యూ వచ్చేసింది..!

Acharya Movie : అచార్య సెన్సార్ రివ్యూ వచ్చేసింది..!
Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి , రామ్‌చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆచార్య..

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి , రామ్‌చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆచార్య.. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి... కాజల్ అగర్వాల్,పూజా హెగ్డేలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం మే 29న థియేటర్‌లోకి రానుంది.. మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబులు హాజరుకానున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఆచార్య మూవీకి యు/ఎ సర్టిఫికేట్ పొందింది.. సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఉంది. ఇక ఈ సినిమాకి సెన్సార్ రివ్యూ కూడా పాజిటివ్ గానే రావడం విశేషం. సెన్సార్ రివ్యూ ప్రకారం ఆచార్య ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, చిరంజీవి, రామ్‌చరణ్‌ల కలయికలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయట.

సినిమా క్లైమాక్స్ పవర్‌ఫుల్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి మెగా అభిమానులను అలరించేలా సినిమా ఉందని అంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story