Chiranjeevi : అభిమాని కూతురి పెళ్లికి మెగాస్టార్ సాయం

Chiranjeevi : అభిమాని కూతురి పెళ్లికి మెగాస్టార్ సాయం
X
Chiranjeevi : అభిమానులకి కేవలం హీరోగానే కాకుండా మంచి మనసున్న మనిషిగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా దగ్గరయ్యారు మెగాస్టార్ చిరంజీవి.

Chiranjeevi : అభిమానులకి కేవలం హీరోగానే కాకుండా మంచి మనసున్న మనిషిగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా దగ్గరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో చిరు ఎప్పుడు ముందే ఉంటారు. తాజాగా కష్టాల్లో ఉన్న తన అభిమానికి చేయూతనందించారు మెగాస్టార్.. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజం కొండలరావు అనే వ్యక్తి చిరంజీవికి పెద్ద అభిమాని.. ఆయన కుమార్తెకి ఇటీవల పెళ్లి కుదిరింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసిన చిరు.. భోళా శంకర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.



Tags

Next Story