సినిమా

Chiranjeevi : మెగాస్టార్ జోరు.. వరుస సినిమాలు షురూ..!

Chiranjeevi : వయసు పెరిగే కొద్ది మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో జోరు పెంచుతున్నారు. ఏకంగా ఈ డిసెంబర్ నెలలో నాలుగు సినిమాలలో చిరంజీవి నటిస్తున్నారు.

Chiranjeevi : మెగాస్టార్ జోరు.. వరుస సినిమాలు షురూ..!
X

వయసు పెరిగే కొద్ది మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో జోరు పెంచుతున్నారు. ఏకంగా ఈ డిసెంబర్ నెలలో నాలుగు సినిమాలలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమాలు ఇప్పటికే పట్టాలేక్కాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం తుదిదశకి చేరుకుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత చిరు 153 మూవీగా గాడ్ ఫాదర్ చిత్రం తెరకెక్కుతుంది. మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్‌' రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత చిరు 154 చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు.. కానీ షూటింగ్ కూడా మొదలైంది. చిరు కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు 155 మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాకి భోలా శంకర్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

సో వరుస సినిమాలతో మెగాస్టార్ మంచి స్పీడ్ మీడున్నారు.

Next Story

RELATED STORIES