Chiranjeevi : ట్రెండింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi : ట్రెండింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి
X

ఈ ఏడాదే చిరంజీవికి అవార్డుల పంట పండింది. ఇటీవలే పద్మవిభూషణ్ అందుకున్నారు చిరంజీవి. ఇప్పుడు గిన్నిస్ అవార్డు సాధించారు. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మ హేష్ గౌడ్ ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. చిరంజీవికి రేవంత్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. చిరంజీవికి గిన్నీస్ బుక్ లో చోటు దక్కడం హర్షణీయమని, సముచిత గౌరవం దక్కినట్టయిందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. చిరంజీవి ప్రతిభకు దక్కిన గౌరవమని అభినందించారు.

"నేను ఎదురు చూడని గొప్ప గౌరవం ఇది. నటన కంటే డ్యాన్స్ పై నాకు ఉన్న ఇష్టమే గిన్నిస్ రికార్డ్ రావడానికి అనుకుంటా. డ్యాన్స్ అనేది నాకు ఎక్స్ట్ ట్రా క్వాలిఫికేషన్. కొరియో గ్రాఫర్స్ వల్ల కూడా నా డ్యాన్స్ లకు క్రేజ్ పెరిగింది. డ్యాన్స్ కు అవార్డు వచ్చినందుకు సంతోషం" అని అవార్డ్ అందుకున్నాక చిరంజీవి వ్యాఖ్యానించారు. గిన్నీస్ బుక్ లోకి చిరంజీవి పేరు ఎక్కిందన్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరుకి గిన్నిస్ రికార్డు దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మెగాస్టార్ కు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది.

సినీ రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. వీటికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ సత్కరించింది. సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి

ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తు న్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story