Chiranjeevi : 'పవర్ స్టార్మ్ సక్సెస్' .. తమ్ముడి సినిమా పై అన్నయ్య రియాక్షన్..!

Chiranjeevi : భీమ్లానాయక్ మూవీ సక్సెస్ కావడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భీమ్లానాయక్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 'నిజమైన పవర్ స్టార్మ్ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్' అంటూ పోస్ట్ చేశారు చిరు. ఈ ట్వీట్ పట్ల మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం చిరు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Heartiest Congratulations on the Thumping Success of #BheemlaNayak True Power Storm! 👏👏👏@PawanKalyan #Trivikram @RanaDaggubati @saagar_chandrak@MusicThaman @MenenNithya @iamsamyuktha_ @dop007 @NavinNooli @SitharaEnts pic.twitter.com/a0U1hs8zGV
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 25, 2022
అటు ఈ సినిమా పైన యంగ్ హీరో నితిన్ కూడా ట్వీట్ చేశారు. " ఇది కదా మాకు కావలసింది. పవన్ కల్యాణ్ విధ్వంసం సృష్టించారు. రానా ఇరగొట్టావ్.. తమన్ మ్యూజిక్‌లో ఫైర్ ఉంది. త్రివిక్రమ్, సాగర్ చంద్రకు కృతజ్ఞతలు" అంటూ పోస్ట్ చేశారు నితిన్. కాగా పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా మెయిన్ లీడ్‌లో తెరకెక్కిన భీమ్లానాయక్ వరల్డ్ వైడ్‌గా నిన్న(ఫిబ్రవరి 25)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, దీనికి థమన్ ఎస్ సంగీతం అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు.
BHEEMLAA NAAYAKK
— nithiin (@actor_nithiin) February 25, 2022
IDHI KADHA MAAKU KAVALSINDHI..
POWERSTAR ON RAMPAGE MODE@RanaDaggubati IRRAGOTTAV#TrivikramSir 🙏🙏❤️❤️❤️😘😘@saagar_chandrak 👏👏👌🏻👌🏻@MusicThaman 🔥🔥🔥🔥🔥🔥@vamsi84 👏👏👏👍👍👍👍
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com