Chiranjeevi : మెగాస్టార్ ముగించాడు..

ఈ శుక్రవారం టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్ వచ్చింది. అది కూడా మెగాస్టార్ నుంచి. మెగాస్టార లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’టాకీ పార్ట్ షూటింగ్ అయిపోయిందట. ఏంటీ నిజంగానే షాక్ అయ్యారు కదా. ఈ వయసులో ఆయన స్పీడ్ చూసి నిజంగానే చాలామంది షాక్ అవుతున్నారు. కొన్నాళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. మధ్యలో ఎన్నికలు రావడంతో పాటు రకరకాల ప్రోగ్రామ్స్ లో కూడా ఆయన కనిపించాడు. అంటే ఇంకా కొన్ని రోజులు పడుతుందనుకున్నారు. కానీ ఈ లోగానే టాకీ పూర్తి కావడం అంటే చిన్న విషయం కాదు. వింటేజ్ హీరోల డెడికేషన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మెగాస్టార్ మరోసారి ప్రూవ్ చేశాడు. అయితే ఓ రెండు పాటలతో పాటు క్లైమాక్స్ ఫైట్ మాత్రమే ఇంకా పెండింగ్ లో ఉన్నాయట. ఈ మొత్తం కూడా ఆగస్ట్ నెలలో పూర్తి చేసేలా ప్లానింగ్ తో ఉన్నారు.
బింబిసారతో ఆకట్టుకున్న వశిష్ట విశ్వంభర సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. బింబిసార లాగానే ఇది కూడా సోషియో ఫాంటసీ మూవీ. త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మరో నలుగురు హీరోయిన్లు కూడా ఉంటారట. ఇది వేర్వేరు లోకాల చుట్టూ సాగే కథ కాబట్టి.. ఆయా లోకాల్లోని దేవ కన్యలుగా వారంతా కనిపించబోతున్నారు అని టాక్. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరంజీవి మళ్లీ సోషియో ఫాంటసీ చేయలేదు. అందుకే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈ మూవీపై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ మూవీని 2025 సంక్రాంతికి విడుదల చేస్తాం అని గతంలోనే అనౌన్స్ చేశారు.
ఏదేమైనా రావు రమేష్ చెప్పినట్టు.. ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విధానం, ఒక విజన్ ఉంటే ఇలాంటి అద్భుతాలు సాధ్యం అవుతాయి. అవన్నీ కెరీర్ మొదట్నుంచీ ఉన్నాయి కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com